షూటింగుల కంటే ట్రైనింగులే ఎక్కవయ్యాయ్

షూటింగుల కంటే ట్రైనింగులే ఎక్కవయ్యాయ్

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో పాతుకుపోయేందుకు అన్ని రకాల ప్లాన్స్ వేసేస్తోంది. పింక్ తో పేరు తెచ్చేసుకుని.. మధ్యలో ఒకట్రెండు ఫ్లాపులు వచ్చినా.. రీసెంట్ గా జుడ్వా2తో గ్లామర్ డాళ్ అనిపించేసుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే హిందీ సినిమాలు ఉండగా.. తాప్సీ చేస్తున్న సినిమాల తీరు చూస్తుంటే.. వాటి షూటింగ్ కంటే అందుకోసం తీసుకునే ట్రైనింగులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నామ్ షబానా అంటూ ఓ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేసిన తాప్సీ.. ఈ సినిమా కోసం చాలా ట్రైన్ అయింది. ఫైటింగ్స్ దగ్గర నుంచి అనేక యాక్షన్ ఎపిసోడ్స్ ను పర్ఫెక్ట్ గా చూపించేసింది. ఆ తర్వాత జుడ్వా2 చిత్రంలో గ్లామర్ గాళ్ అవతారం కావడం.. బికినీలో దర్శనం ఇచ్చే సీన్స్ ఉండడంతో.. ఈ చిత్రం కోసం ఫిజిక్ ను మార్చుకుంది. జిమ్ లో తెగ వర్కవుట్స్ చేసి బాడీని మార్చుకునేందుకు.. ఫిట్నెస్ ట్రైనర్ దగ్గర చాలానే శిక్షణ పొందింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో ఉన్న సినిమాలు ఈ బాపతువే.

అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించింది తాప్సీ. ఇందులో ఓ షూటర్ పాత్రను పోషిస్తుందట. ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రం కోసం.. షూటింగ్ లో తెగ ట్రైనింగ్ తీసుకుంటోందట ఈ ఢిల్లీ బేబీ. మరోవైపు హాకీ టీం మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ పై రూపొందుతోన్న బయోపిక్ 'ఫ్లికర్ సింగ్'లో హాకీ ప్లేయర్ గా కనిపించనున్న తాప్సీ.. ఆ మూవీ కోసం కూడా చాలానే ట్రైనింగ్ తీసుకుంటోంది. తాప్సీ వాలకం చూస్తుంటే.. ప్రతీ సినిమాకి ఏదో ఒక ట్రైనింగ్ తప్పనిసరి అనిపిస్తోంది. ఈ అమ్మడు సెట్స్ లో కంటే గ్రౌండ్స్ లో ఎక్కువ కాలం గడిపేస్తోందనుకుంటా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English