వైజాగ్ ని వాషింగ్టన్ చేసేస్తారా ఏంటి?

వైజాగ్ ని వాషింగ్టన్ చేసేస్తారా ఏంటి?

హాలీవుడ్ సినిమా ప్రేమికులకు సహజంగా ఓ డౌట్ వస్తూ ఉంటుంది. ఈ భూమికి ఎలాంటి ఉపద్రవం వచ్చినా.. అన్నీ ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ పైనే జరుగుతూ ఉంటాయి. ఎలియన్స్ దాడులు చేస్తూ ఉంటారు.. ఆస్టరాయిడ్స్ వచ్చి గుద్దుకుంటాయ్.. వరదలు వస్తూ ఉంటాయి.. రాకాసి బల్లులు-గాడ్జిల్లాలు దాడి చేస్తూ ఉంటాయి.. భూకంపాలు- సునామీలు- మంచు తుఫానులు.. ఇలా ఎన్నో రకాల ఉపద్రవాలు ఉంటే.. అన్నీ వాషింగ్టన్ పైనే ఎటాక్ చేయడం హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు వైజాగ్ ను కూడా మరో వాషింగ్టన్ చేసేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం ఘాజీ అంటూ ఓ మల్టీ లాంగ్వేజ్ మూవీ వచ్చింది. ఇందులో ఓ సబ్ మెరైన్ ద్వారా వైజాగ్ ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది హిస్టరీ బేస్డ్ గా తీసిన మూవీ కావడంతో.. అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టిక్ టిక్ టిక్ అంటూ జయంరవి హీరోగా రూపొందిన ఓ డబ్బింగ్ సినిమా వస్తోంది. ఈ సినిమాలో ఓ గ్రహ శకలం వచ్చి వైజాగ్ ని ఢీ కొంటుందని ట్రైలర్ లో చెప్పారు. 60 కిలోమీటర్ల ప్రాంతం అంతా విచ్ఛిన్నం అయిపోతుందట. దాన్ని ఓ మెజీషియన్ అయిన హీరో ఎలా అడ్డుకున్నాడన్నదే సినిమా కాన్సెప్ట్.

ఇలా సైన్స్.. హిస్టరీ బేస్డ్ మూవీస్ మాత్రమే కాదు.. వైజాగ్ కేంద్రం పలు సాంఘిక సినిమాలు కూడా ఉంటాయి. సూర్య మూవీ సింగం సిరీస్ లో అయితే.. విశాఖ కేంద్రంగానే ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు సాగిపోతూ ఉంటాయి. లవ్ స్టోరీలకు ఆర్కే బీచ్ అడ్డా అని చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా సంక్రాంతికి విడుదల అయిన జైసింహాలో కూడా వైజాగ్ బీచ్ రోడ్డుపై ఓ ప్రధాన సన్నివేశం ఉంటుంది. అన్ని రకాల కార్యకలాపాలకు వైజాగ్ ను ఉపయోగించుకుంటున్న మన సినిమా మేకర్స్.. మరో వాషింగ్టన్ చేసేట్లుగా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు