40 కోట్ల లోపే జక్కన్న మల్టీస్టారర్

40 కోట్ల లోపే జక్కన్న మల్టీస్టారర్

టాలీవుడ్ లోనే అతి పెద్ద మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మూవీకి రూపకల్పన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల రూమర్స్ రాగా.. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ అప్ డేట్స్ వస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న కొన్ని కబుర్ల ప్రకారం అయితే.. ఈ సినిమాకు అటు దర్శకుడు కానీ.. ఇటు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కానీ రెమ్యూనరేషన్ తీసుకోరట. అంటే దర్శకధీరుడి కోసం ఫ్రీగా సినిమాలో నటించేస్తారని అర్ధం కాదు. వీరికి ఆయా సినిమాలు ఆర్జించిన లాభాల్లో ప్రాఫిట్స్ ను పంచుకుంటారంతే. ప్రస్తుతం రాజమౌళి పేరు చెబితేనే వంద కోట్లకు మించి.. ఆ సినిమా స్థాయికి అనుగుణంగా బిజినెస్ ఈజీగా జరిగిపోతుంది. ఇంక రామ్ చరణ్.. ఎన్టీఆర్ ల మూవీస్ కు వంద కోట్లకు పైగానే మార్కెట్ ఉంది. ఇలాంటి సమయంలో ఈ ముగ్గురు కలిసి నటిస్తే ఆ ప్రాజెక్టు రేంజ్ ఊహించుకోవచ్చు.

తన తర్వాతి చిత్రానికి అసలు గ్రాఫిక్స్ అవసరమే లేకుండా తెరకెక్కించాలని కోరుకుంటున్నట్లు కొన్ని నెలల క్రితమే చెప్పాడు జక్కన్న. ఇప్పుడు అదే తరహా ప్లానింగ్ లో ఉన్నారు. అంటే సినిమా బడ్జెట్ లో అత్యంత కీలకమైన పారితోషికాలు ఏవీ ఇవ్వకుండానే మూవీ పిక్చరైజేషన్ పూర్తయిపోతుందన్న మాట. ప్రస్తుతం వినిపిస్తున్న మాటల ప్రకారం అయితే.. ఓ 30-40 కోట్లలో సినిమాను వీలైనంత రిచ్ గా తెరకెక్కించి.. రాజమౌళి మార్క్ ఎమోషన్స్ పండించేసి.. భారీ రేట్లకు విక్రయించేసి.. అపుడు పారితోషికాలు పంచుకుంటారట రాజమౌళి.. ఎన్టీఆర్.. రామ్ చరణ్. రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేయడంలో అసలు ఆంతర్యం ఇదే అయుండచ్చు అని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English