పూనమ్ కౌర్ సెటైర్లు ఎవరి మీద?

పూనమ్ కౌర్ సెటైర్లు ఎవరి మీద?

కొంచెం విరామం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది పూనమ్ కౌర్. ఆమె తాజాగా చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. మన దేశంలో పోర్న్ స్టార్లకే మెరుగైన జీవనం.. గౌరవం లభిస్తోందని.. సాధారణ భారతీయ అమ్మాయిల కంటే వాళ్ల పరిస్థితే మీలని ఆమె వ్యాఖ్యానించింది. అమాయకులైన అమ్మాయిలకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతాయని.. వాళ్ల పేర్లను దుర్వినియోగం చేస్తారని.. దూషిస్తారని పూనమ్ అంది. ఒక అమ్మాయి ఏదైనా ఒక ప్రయోజనం కోసం వాళ్లు నిలబడితే.. అందరూ కలిసి ఆమె ఆత్మను, శరీరాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తారని కూడా పూనమ్ వ్యాఖ్యానించింది.

ఎవరి పేర్లూ పెట్టకుండా పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి అనే చర్చ మొదలైంది. ఇండియాలో మంచి జీవనం సాగిస్తున్న పోర్న్ స్టార్ అంటే.. సన్నీ లియోనే. ఐతే పూనమ్ వ్యాఖ్యలు ఆమె మీద కాకపోవచ్చని భావిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్‌తో తీస్తున్న ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా చర్చనీయాంశంగా మారిన సమయంలోనే పూనమ్ ఈ వ్యాఖ్యలు చేసింది కాబట్టి.. పూనమ్ పేరుతో ముడిపడ్డ పవన్ కళ్యాణ్‌ను వర్మ టార్గెట్ చేస్తుంటాడు కాబట్టి వాళ్లిద్దరికీ ఈ వ్యాఖ్యలు తగలొచ్చు. అలాగే మహేష్ కత్తిని కూడా పూనమ్ పరోక్షంగా టార్గెట్ చేసిందని భావిస్తున్నారు. అతడికి, పూనమ్‌కు మధ్య ఈ మధ్య పెద్ద గొడవే నడిచిన సంగతి తెలిసిందే. మరి వర్మ, కత్తి ఈ కామెంట్లపై ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు