అబద్దాలతో మంచు లక్ష్మికి ఇబ్బందులే

అబద్దాలతో మంచు లక్ష్మికి ఇబ్బందులే

మంచు మోహన్ బాబు వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తనకే ప్రత్యేకమైన సినిమాలు.. క్యారెక్టర్లతో ఆకట్టుకోవడంలో మంచు లక్ష్మికి బోలెడంత ట్యాలెంట్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయి సక్సెస్ చిక్కకపోపోయినా.. డిఫరెంట్ రోల్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.

ప్రస్తుతం మహిళా ప్రాధాన్యం ఉన్న ఓ మూవీలో నటిస్తోంది ఈ మంచు బ్యూటీ. వైఫ్ ఆఫ్ రామ్ అనే మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది మంచు లక్ష్మి. విజయ్ యెలకంటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. గతంలో ఇతను ఎస్ఎస్ రాజమౌళి దగ్గర వర్క్ చేశాడు. వైఫ్ ఆఫ్ రామ్ మూవీని మంచు లక్ష్మి అంగీకరించడానికి ప్రధాన కారణం.. ఆమె పాత్రే అని తెలుస్తోంది. ఈ సినిమాలో అబద్ధాలను విపరీతంగా నమ్మేసి.. ఆనక తీరిగ్గా ఇబ్బందుల్లో పడిపోయే పాత్రలో నటిస్తోందట మంచు లక్ష్మి. ఈ పాత్ర ద్వారా మొదట నవ్వులు పుట్టించినా.. ఆ తర్వాత మూవీ థ్రిల్లర్ జోనర్ లోకి టర్న్ అవుతుందని అంటున్నారు.

అబద్ధాలను నమ్మేయడం అనే వీక్నెస్ కారణంగా ఓ మహిళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుందో చూపించడమే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందట. మంచు ఎంటర్టెయిన్మెంట్స్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన వైఫ్ ఆఫ్ రామ్.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు