జిమ్ములో గడిపేసి జువ్వలా మారుతున్నారు

జిమ్ములో గడిపేసి జువ్వలా మారుతున్నారు

అందాల భామలకు ఫిట్నెస్ చాలా ముఖ్యం. హీరోలు అంతో ఇంతో లావయినా ఇమేజ్ తో లాగించేసే అవకాశం ఉంటుంది. కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం కొలతల్లో తేడా వస్తే ఛాన్సులు తగ్గిపోతాయి. అదే సమయంలో అభిమానులు కూడా తెగ ఫీలయిపోతుంటారు. తమ రేంజ్ కాపాడుకోవడంలో బ్యూటీస్ కు ఫిట్నెస్ తప్పనిసరిగా మారిపోయింది.

టాలీవుడ్ టాప్ బ్యూటీ అనుష్క పరిస్థితి చూస్తూనే ఉన్నాం. బొద్దుగా మారిపోయిన తర్వాత ఈ భామ బాగానే ఇబ్బంది పడింది. అవకాశాలకు కొదువ లేకపోయినా.. గ్లామర్ రోల్స్ చేయడం కష్టమైపోయింది. గత కొన్ని నెలలుగా యోగాతో పాటు.. కోయంబత్తూర్ వెళ్లి మరీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుని.. ఈ వయ్యారి అదనపు బరువు అంతా కరిగించేసుకుంది. ప్రస్తుతం అనుష్క ఎంత స్లిమ్ గా మారిపోయిందో రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే అర్ధమవుతుంది.

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా 2 నెలలకు పైగా బ్రేక్ తీసుకుని ఫిట్నెస్ వర్కవుట్స్ లో పాల్గొంది. ఈమె ఫిజిక్ పై విమర్శలు లేకపోయినా.. మరిన్ని మెరుపులను జోడించుకునేందుకు తెగ కష్టపడింది రకుల్.

హెబ్బా పటేల్ అయితే ఫిట్నెస్ విషయంలో చాలా ఎక్కువగా కష్టపడిపోయింది. ఏకంగా ఏడు నెలల పాటు జిమ్ లోనే గడిపేసిందంటే.. ఈ భామ కమిట్మెంట్ అర్ధమవుతుంది. ఇప్పుడీ కుమారి లుక్స్ చూస్తే అభిమానులు మైమరచిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English