ఆ హీరోతో 17 ఏళ్ల తరువాత..

ఆ హీరోతో 17 ఏళ్ల తరువాత..

గతంలో ఎందరో అమ్మాయిలకు కలల హీరో అయిన మాధవన్,.. మళ్లీ ఇప్పుడు ఫుల్ బూమ్ లోకి వచ్చేశాడు. విభిన్నమైన సినిమాలతో తెగ ఆకట్టుకుంటున్నాడు ఈ హీరో. లవర్ బోయ్ ఇమేజ్ తో దిగ్గజ దర్శకులతో సినిమాలు చేసిన మాధవన్.. ప్రస్తుతం న్యూ జనరేషన్ మూవీస్ ను చేస్తూ అలరిస్తున్నాడు.

మాధవన్ తో సినిమా తీసిన ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో గౌతమ్ మీనన్ కూడా ఉన్నాడు. 2001లో వీరి కాంబినేషన్ లో చెలి చిత్రం వచ్చి.. తెలుగు- తమిళ భాషల్లో మంచి సక్సెస్ సాధించింది. అటు మ్యూజికల్ గా కూడా హిట్ అయిన ఈ మూవీలో.. అబ్బాస్.. రీమా సేన్ కూడా ఆకట్టుకుంటారు. ఇప్పుడు మళ్లీ 17 ఏళ్ల తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడట మాధవన్. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అనేయగా.. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్మెంట్ జరుగుతోంది. తమిళ్ తోపాటే.. హిందీ..ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ సినిమా రూపొందుతుందని చెబుతున్నారు.

మాధవన్ ప్రధాన పాత్రలో నటించే ఈ చిత్రం షూటింగ్ ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే.. జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తమిళ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోయినా.. రూమర్ స్టేజ్ లోనే ఆసక్తి కలిగిస్తుండడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు