సూపర్‌స్టార్స్‌ కంటే వాళ్లే నయం

సూపర్‌స్టార్స్‌ కంటే వాళ్లే నయం

ఇటీవలి కాలంలో హిట్టయిన పెద్ద సినిమాల లిస్టులో బాహుబలిని మినహాయిస్తే ఖైదీ నంబర్‌ 150 తప్ప మరోటి కనిపించదు. గత ఏడాది చిరంజీవి చిత్రం తప్ప మిగతా పెద్ద సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. జై లవకుశ, డిజెకి ఓపెనింగ్స్‌ వచ్చినా కానీ లాస్‌లు తప్పలేదు. ఇక స్పైడర్‌, రీసెంట్‌గా వచ్చిన అజ్ఞాతవాసి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్టార్‌ హీరోల మీద బిజినెస్‌ చేయడం జూదంలా మారిపోయింది.

ఏది ఆడుతుందో, ఏది ఫ్లాపవుతుందో తెలియక కాంబినేషన్‌ క్రేజ్‌కి పాకులాడిన బయ్యర్లకి ఎదురు దెబ్బలు తగిలేస్తున్నాయి. ఎనభై నుంచి వంద కోట్లు వెచ్చించిన బయ్యర్లకి లాభాల మాట అటుంచి పెట్టుబడి తిరిగి వస్తే చాలనుకునే పరిస్థితి వుంది. ఈమధ్య కాలంలో లాభాలు చూసిన సినిమాలన్నీ మీడియం రేంజ్‌వే. ఫిదా, నాని సినిమాలు, శర్వానంద్‌ సినిమాలు, అర్జున్‌రెడ్డి లాంటి చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ని కాపాడాయి.

పెద్ద హీరోల సినిమాలపై ఒకేసారి పెట్టుబడి పెట్టి పోగొట్టుకోవడం కంటే ఇలాంటి సినిమాలు రెండు, మూడు కొని లాభనష్టాలు బేరీజు వేసుకోవడం బెటర్‌ అని బయ్యర్లు భావించే పరిస్థితి వచ్చింది. పెద్ద సినిమాలు ఇస్తోన్న షాక్‌లతో, త్వరలో రాబోతున్న మీడియం రేంజ్‌ సినిమాలకి గిరాకీ వీర లెవల్లో పెరిగిపోయింది.  ఒక రెండు, మూడు పెద్ద సినిమాలు హిట్‌ అయి కోట్లు కొల్లగొడితే కానీ మళ్లీ పెద్ద సినిమాల పట్ల నమ్మకం ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు