అజ్ఞాతంలోకి పవన్‌కళ్యాణ్‌!

అజ్ఞాతంలోకి పవన్‌కళ్యాణ్‌!

అజ్ఞాతవాసి రిజల్ట్‌ తేలిపోయిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఇంతవరకు ఒక ట్వీట్‌ వేయడం కానీ, పబ్లిక్‌ అప్పీయరెన్స్‌ ఇవ్వడం కానీ చేయలేదు. సినిమా ప్రమోషన్స్‌ కోసమని ఓపెన్‌ చేసిన ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి కూడా అజ్ఞాతవాసికి సంబంధించిన ట్వీట్స్‌ ఏమీ పడలేదు. పది రోజుల క్రితం ట్రెయిలర్‌ రిలీజ్‌ అయినపుడు మాత్రం ట్వీట్‌ వేసి ఆ తర్వాత ఆ అకౌంట్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

పవన్‌ అఫీషియల్‌ అకౌంట్‌లో కూడా ఎలాంటి రాజకీయ సందడి లేదు. జనరల్‌ టాపిక్స్‌ గురించి కూడా పవన్‌ ఏమీ స్పందించడం లేదు. మామూలుగా తన సినిమాలు హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా పట్టించుకోని పవన్‌ ఈసారి మాత్రం హర్ట్‌ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి హిట్‌ అయితే కనుక వెంటనే పొలిటికల్‌ టూర్‌ స్టార్ట్‌ చేయాలని అనుకున్నాడట.

ఈ సినిమా డిజాస్టర్‌ అయి ఫాన్స్‌ నీరుగారిపోవడంతో ఇప్పుడు తన పబ్లిక్‌లోకి వెళ్లినా ఫాన్స్‌ ఉత్సాహంగా పాల్గొంటారా అనే అనుమానం కలగడం వల్ల పవన్‌ బయటకి రావడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతవరకు పవన్‌ తదుపరి స్టెప్‌ గురించి మాత్రం ఎలాంటి ఇన్‌ఫర్మేషన్‌ లేదు. రాజకీయంగా ఏమి చేయబోతున్నాడో, సినిమాల పరంగా కంటిన్యూ అవుతాడో లేదో అనేది కూడా తెలియడం లేదు. పవన్‌ అలా చేస్తాడట, ఇది చేయబోతున్నాడట అంటూ ఊహాగానాలే తప్ప అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు