ట్రాక్‌ రికార్డులు నమ్ముకుంటే గల్లంతే

ట్రాక్‌ రికార్డులు నమ్ముకుంటే గల్లంతే

ఎంత పెద్ద స్టార్‌ అయినా సరే, కొందరు దర్శకుల విషయంలో క్వశ్చన్‌ చేయలేరు. వాళ్ల ట్రాక్‌ రికార్డుని చూసి వాళ్లు చెప్పింది బ్లయిండ్‌గా చేసుకుంటూ పోతారు. అయితే ఆ దర్శకులు అన్ని వేళలా తమ స్థాయికి తగ్గ సినిమా తీస్తారనే గ్యారెంటీ లేదు. ఎప్పుడయితే సదరు దర్శకుడు బ్లండర్‌ చేసాడో అప్పుడు ఆ సినిమాకి అందరూ నిలువునా మునిగిపోతారు. హీరోలు ఫ్రంట్‌ ఫేస్‌ కనుక వాళ్లే ఆ పరాజయానికి బాధ్యులవుతారు.

దర్శకులని, వాళ్ల ట్రాక్‌ రికార్డుని గుడ్డిగా నమ్మిన పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు భారీ మూల్యం చెల్లించుకున్నారు. త్రివిక్రమ్‌ నుంచి అజ్ఞాతవాసిలాంటి వాసి తక్కువ సినిమా వస్తుందని ఎవరు మాత్రం ఊహించి వుంటారు? బయ్యర్లు పెట్టిన డబ్బులో సగానికి పైగా పోవడం ఖాయమని ట్రేడ్‌ అంచనా వేస్తోన్న ఈ చిత్రం హీరోగా పవన్‌ ప్రతిష్టని బాగా దెబ్బ తీసింది. ఇంతకుముందు మహేష్‌కి ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి.

మురుగదాస్‌ని నమ్మి స్పైడర్‌, శ్రీకాంత్‌ అడ్డాల మీద నమ్మకంతో బ్రహ్మూత్సవం, శ్రీను వైట్ల మీద గురితో ఆగడు... ఇలా మహేష్‌కి దర్శకుల ట్రాక్‌ రికార్డ్‌ పలుమార్లు ఎర్త్‌ పెట్టింది. ఈ ఉదంతాలతో అయినా ఇకపై దర్శకులని గుడ్డిగా ఫాలో అయిపోకుండా నిజంగా వారు చెప్పిన కథలో స్టఫ్‌ వుందా లేదా అని చెక్‌ చేసుకుని, సినిమా ప్రొడక్షన్‌ స్టేజ్‌లో వుండగానే క్రాస్‌ చెక్‌ చేసుకుంటూ వుంటే మొత్తంగా మునిగిపోయిన తర్వాత బాధ పడాల్సిన పని వుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English