గురువుగారికి దరువేసింది అందుకే

గురువుగారికి దరువేసింది అందుకే

ఇక ఏ విషయాన్నైనా రెండు వైపుల నుండీ చూడటం అలవాటు మన సినిమా వాళ్లకి. అందుకే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు చేసే ప్రతీ కామెంటును ఇటు పాజిటివ్‌గాను అటు నెగెటివ్‌గాను చూస్తుంటారు. ఇక పైసా ఆడియో రిలీజ్‌ కార్యక్రమానికి విచ్చేసిన దాసరి, ఆ సినిమాను పొగడలేదు కాని, కృష్ణవంశీని,  నాని ని ఆకాశానికి ఎత్తేసారు.

అదే విధంగా కృష్ణవంశీ కూడా గురువుగారిని బాగా పైకెత్తేశాడు. నాని అయితే ఏకంగా తన తదుపరి నలభై సినిమాలకు గురువుగారే ఆడియో రిలీజ్‌ చెయ్యాలని కోరుకున్నాడు. థ్యాంక్‌ గాడ్‌, గురువుగారి దర్శకత్వంలో నటిస్తానని చెప్పలేదు అంటున్నారు ఫ్యాన్స్‌. అయిత ఇలా గురువు గారి దరువు కార్యక్రమం ఎందుకు జరిపారంటే, దానికి ఒక కారణం ఉంది.

పీకల్లోకు అప్పుల్లో కూరుకుపోయి పైసా సినిమాను విడుదల చేయలేని స్థితికి చేరుకున్నా నిర్మాత రమేష్‌ పుప్పాల. సరిగ్గా అదే టైములో విష్ణు మూర్తి అభయహస్తం ఇచ్చినట్లు, దాసరి గారి సిరి మీడియా సినిమా బయటకు రిలీజ్‌ చెయ్యడానికి సరే అంది. అందుకే ఆయన కోసం ఆ దరువు వేసినట్లు తెలుస్తోంది...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు