నాగార్జున గారూ.. ఈ రచ్చ ఎలిమినేట్ చేయండి

నాగార్జున గారూ.. ఈ రచ్చ ఎలిమినేట్ చేయండి

రామ్ గోపాల్ వర్మ ఏదైనా టాపిక్ ను పట్టుకుంటే దాన్ని జనాల్లోకి ఎక్కించడానికి ఎంతకైనా పాకులాడతాడు. అప్పట్లో ట్విట్టర్ నుంచి జంప్ అయిపోయిన ఈయన.. ఆ తర్వాత ఒకట్రెండు ప్రాజెక్టులకు ఇతర వేదికల నుంచి చేసిన ప్రచారానికి అంతగా హైప్ రాలేదు. అందుకే అనుకుంటా.. మళ్లీ ట్విట్టర్ లో దర్శనం ఇచ్చేసిన వర్మ.. జీఎస్టీ అంటూ హంగామా బిగిన్ చేసి.. ఆశించిన రిజల్ట్ ను బాగానే వర్కవుట్ చేశాడు.

గాడ్.. సెక్స్.. ట్రూత్ అంటూ రోజూ ఉదయం-సాయంత్రం బూతు భాగోతాన్ని చెబుతూ.. చూపిస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఫస్ట్ లుక్.. ట్రైలర్.. ఫోటోలు.. ఇలా ఏదో ఒక పేరుతో బూతు ఫోటోలు.. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు వర్మ. ఈయన స్టైల్ ఇంతే అని సరిపెట్టుకుందామని భావిస్తే.. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్టు అలా ఊరుకోనివ్వడం లేదు. మళ్లీ రెండున్నర దశాబ్దాల తర్వాత నాగార్జునతో జోడీ కట్టిన ఈయన.. నాగ్ ను పోలీస్ పాత్రలో చూపించబోతున్నాడు. అలనాటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివను మించిన మూవీ తీస్తానంటున్నాడు.

కానీ నాగ్ మూవీ సంగతులు మాత్రం చెప్పడం లేదు వర్మ. కనీసం నాగార్జున అయినా ఈ బూతు భాగోతానికి అరికట్ట వేయాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు. దూకుడు మూవీలో బ్రహ్మానందం రిక్వెస్ట్ చేసిన మాదిరిగా.. నాగార్జున గారూ.. ఈ బూతును ఎలిమినేట్ చేయడం సారూ అంటూ వేడుకోలు చేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు