మళ్లీ సొంత ప్రొడక్షన్లోకి దిగాడేంటో

మళ్లీ సొంత ప్రొడక్షన్లోకి దిగాడేంటో

టాలీవుడ్ యంగ్ హీరోల్లో మరీ దారుణమైన ఫామ్ లో ఉన్న హీరోల జాబితాలో సుమంత్ అశ్విన్ పేరు ప్రముఖంగా చెప్పేసుకోవచ్చు. 2012లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరో.. ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ సక్సెస్ కానీ.. పేరు తెచ్చిపెట్టే సినిమా కానీ చేయలేకపోయాడు. అయినా సరే ఎంఎస్ రాజు లాంటి బడా నిర్మాత కుమారుడు కావడంతో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

సుమంత్ హీరోగా నటించిన సినిమాలకు.. ఆరంభంలో ఎక్కువగా తండ్రి ఫైనాన్స్ చేశారు. బ్యానర్ పేరు వేరే అయినా ఎంఎస్ రాజు సపోర్ట్ చాలానే ఉంటుంది. అయితే.. ప్రస్తుతం ఈ హీరో 'హ్యాపీ వెడ్డింగ్' అంటూ సినిమా చేస్తున్నాడు సుమంత్ అశ్విన్. ఇందులో మెగా డాటర్ నీహారిక కొణిదెల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కోసం మళ్లీ ఎంఎస్ రాజుగ భారీగానే ఇన్వెస్ట్ మెంట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఫ్యాషన్ డిజైనర్ మూవీ ద్వారా ఈ హీరో కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించారు. వంశీ దర్శకత్వంలో.. లేడీస్ టైలర్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. టాలీవుడ్ హిస్టరీలో స్పెషల్ గా ఈ ఫ్యాషన్ డిజైనర్ నిలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మూవీ ఆకట్టుకోలేకపోవడంతో.. ఇప్పుడు మళ్లీ సొంత ప్రొడక్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల్లోకి రాకముందు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు వర్క్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు తన సినిమాలకు తానే నిర్మాణం చేసుకోవాల్సి వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు