ప్రమోషన్ లేకుండా వర్కువట్ అవుద్దా?

ప్రమోషన్ లేకుండా వర్కువట్ అవుద్దా?

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తాజా చిత్రం పద్మావత్ అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజుకు సిద్ధమవుతోంది. రాజపుత్రులు తమ గౌరవానికి ప్రతీకగా భావించే రాణి పద్మావతి జీవిత గాథగా ఈ సినిమా తెరకెక్కించారు. రాజపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమా తీశారంటూ వివాదాలు చుట్టుముట్టడంతో రిలీజ్ వాయిదా వేశారు.

సినిమాపై వచ్చిన వివాదాలను తరవాత కేంద్ర సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసి ఐదు మార్పులు మాత్రం సూచించి విడుదలకు ఓకే చెప్పింది. దీంతో ఈనెల 25న పద్మావత్ థియేటర్లకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి హీరోహీరోయిన్లుగా నటించిన షాహిద్ కపూర్ దీపికా పదుకనే.. విలన్ గా నటించిన రణ్ వీర్ ఎలాంటి ప్రమోషన్లు చేయబోవడం లేదు. అసలు వీరు ఈ సినిమా గురించి ఎక్కడా పెదవి విప్పి మాట్లాడకూడదనే డిసైడైపోయారు. ఏ చిన్నమాట తేడా వచ్చినా మరిన్ని వివాదాలు తలెత్తే ఆస్కారం ఉన్నందున ఎందుకొచ్చిన ఇబ్బందిగా భావించి మౌనంగా ఉండిపోవడమే మేలని లీడ్ కాస్ట్ అంతా నిర్ణయించుకున్నారు.

అయితే పద్మావత్ సినిమాలోని నటులే కాదు.. నిర్మాతలు కూడా దాదాపుగా ఇదే స్ట్రాటజీ ఫాలో అయిపోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఏమీ పెద్దగా చేయడం లేదు. సినిమా పోస్టర్లు కూడా గోడల మీద వేయకుండా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ స్ర్టాటజీ వర్కవుట్ అవుతుందా? కోట్లు రూపాయలు పెట్టి ప్రమోట్ చేస్తేనే కదా.. సినిమా హాళ్ళకు జనాలు వచ్చేది. అవేమీ చేయకుండా సినిమా రిలీజ్ అంటే.. పాపం భన్సాలి.. ఏమవుతుందో ఏంటో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English