ధనుష్‌కు ఇళయరాజా గొంతు ఇచ్చాడు

ధనుష్‌కు ఇళయరాజా గొంతు ఇచ్చాడు

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా అరుదుగా మాత్రం గొంతు సవరించుకుంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన పాటలు పాడుతుంటారు. ఐతే ఆయన ఎప్పుడు పాట పాడినా అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘కూలీ నంబర్ వన్’లో కలయా నిజమా.. ‘గుండెల్లో గోదారి’లో టైటిల్ సాంగ్ ఆయన పాడినవే. ఆ పాటలు ఇళయరాజా అభిమానులు ఎంతో ఆనందాన్నిచ్చాయి.

తమిళంలో కూడా ఆయన పాడిన పాటలన్నీ హిట్టే. ఇప్పుడు కొంత విరామం తర్వాత ఇళయరాజా మళ్లీ ఓ పాట పాడారు. యువ కథానాయకుడు ధనుష్ కోసం ఆయన పాట పాడటం విశేషం.
ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘మారి-2’లో ఇళయరాజా పాట పాడారు. ఈ విషయాన్ని ధనుష్ మహదానందంతో ప్రకటించాడు. కనుమ పండుగ రోజు ఇళయరాజాతో కలిసి ఉన్న ఫొటోల్ని అతను షేర్ చేశాడు. ఇద్దరూ పంచెకట్టులో కనిపించారు. ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోలో పాట పాడుతున్న ఫొటోను కూడా అతను షేర్ చేశాడు. సిద్దార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’ తీసిన బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మారి-2’.

ధనుష్-బాలాజీ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘మారి’కి ఇది సీక్వెల్. ఐతే ‘మారి’ ఏమంత గొప్పగా ఆడలేదు. ఏదో యావరేజ్ అనిపించుకుంది. అయినా ఈ చిత్రానికి సీక్వెల్ తీయడం ఆశ్చర్యమే. ధనుష్ ఇది కాక మూడు సినిమాలు చేస్తున్నాడు. అతను నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు