నిహారిక లుక్ భయపెడుతోంది

నిహారిక లుక్ భయపెడుతోంది

మెగా డాటర్ గా టాలీవుడ్ అరంగేట్రం చేసిన బ్యూటీ నీహారిక.. ఇక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. టీవీలో యాంకర్ గా.. సోషల్ మీడియాలో యాక్ట్రెస్ గా మంచి మార్కులే వేయించుకున్నా.. సినిమాల్లో మాత్రం ఆ ఫీట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమాల విషయంలో నెమ్మదించినా.. తమిళ్ లో మాత్రం క్రేజీ ప్రాజెక్టును విడుదలకు సిద్ధం చేసేసింది నీహారిక.

ఒరు నల్ల నాల్ పాత్రు సొల్రేన్ అనే మూవీలో నటిస్తోంది నాగబాబు తనయ. విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం పేరుకు అర్ధం.. 'సరైన సమయంలో నేను నీకు చెబుతాను'. ఆరుముగ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా కోలీవుడ్ లో సత్తా చాటేందుకు నీహారిక ఉత్సాహపడుతోంది. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాగా.. త్వరలో ఈ మూవీని థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా జోరుగానే సాగుతుండగా.. విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఓ కొత్త పోస్టర్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది నీహారిక.

జీన్స్ ప్యాంట్.. టాప్ వేసుకుని నీహారిక కనిపిస్తున్నా.. కంప్లీట్ గా బ్యాక్ డ్రెస్.. వెనుక అంతా చిమ్మ చీకటి బ్యాక్ గ్రౌండ్.. ఈ భామతో పాటు పక్కనే ఉన్న హీరో కూడా బ్లాక్ డ్రెస్ వేసుకోవడం.. అతని భుజంపై గద.. అమ్మడి డ్రెస్ పై భారీగా కనిపిస్తున్న గోల్డ్ ఆర్నమెంట్స్.. చేతిలో గన్ చూస్తుంటే.. మోడర్న్ రావణాసురుడు- అతని భార్య జంటగా కనిపిస్తున్నట్లుగా అనిపించక మానదు.