వెంకీతో మాంత్రికుడికి మరింత డ్యామేజ్

వెంకీతో మాంత్రికుడికి మరింత డ్యామేజ్

అజ్ఞాతవాసి మూవీతో అత్యధికంగా డ్యామేజ్ జరిగినది త్రివిక్రమ్ శ్రీనివాస్ కే. పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పెట్టుకుని.. కనీసం ఒక్క సన్నివేశాన్ని కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడనే కామెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి. అన్యమనస్కంగా నటించాడనే కామెంట్స్ పవన్ పై కూడా ఉన్నా.. త్రివిక్రమ్ పై వచ్చే విమర్శలతో పోల్చితే ఇవి తక్కువే.

అజ్ఞాతవాసి విషయంలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలానే తప్పులు జరిగాయనే సంగతిపై చాలానే చర్చ ఉంది. ఇలాంటి సమయంలో మూవీ నుంచి 12 నిమిషాల ఫుటేజ్ తొలగించి.. ఏడున్నర నిమిషాల ఎపిసోడ్ ను కొత్తగా యాడ్ చేశారు మేకర్స్. ఇందులో వెంకటేష్ తో నటింపచేసిన క్యామియో ఉంది. అయితే.. ఈ క్యామియోతో మూవీకి ఒరిగింది ఏమీ లేదు సరికదా.. అసలు వెంకీ రోల్ ఎందుకో అర్ధం కాని పరిస్థితి. అసలు అంత సిల్లీగా ఎలా సీన్స్ తీస్తారని.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడే ఈ సీన్స్ నిజంగా రాసి తెరకెక్కించాడా అని అనుమాన పడే పరిస్థితి కనిపిస్తోంది.

పవర్ స్టార్ ఇమేజ్.. వెంకీ లాంటి స్టార్ హీరో క్యామియో.. అడిగినంత ఖర్చు చేసే ప్రొడ్యూసర్.. అడిగిన మేరకు మెప్పించే హీరోయిన్స్.. ప్రతిభావంతులైన క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇంతమందిని పెట్టుకుని మరీ ఒక్క సన్నివేశంలో కూడా మెప్పించలేకపోవడం దారుణమే. అయితే.. వెంకీ క్యామియో యాడ్ చేసిన తర్వాత.. త్రివిక్రమ్ పై విమర్శల జోరు మరింతగా పెరగడం గమనించాల్సిన విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు