అందుకే దిల్ రాజుకు.. మ‌ణికి నో చెప్పింద‌ట‌

అందుకే దిల్ రాజుకు.. మ‌ణికి నో చెప్పింద‌ట‌

అందం అంతంత మాత్ర‌మే. ఆ మాట‌కు వ‌స్తే.. ఈ అమ్మాయి హీరోయినా? అన్న క్వ‌శ్చ‌న్ వేసే ఫేస్ తో సూప‌ర్ హిట్ కొట్టేసి.. ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్న ఒక హీరోయిన్ దిల్ రాజు లాంటి నిర్మాత నిర్మించే సినిమాకు.. మ‌ణిర‌త్నం ఆఫ‌ర్ కు డ‌బుల్ నో చెప్పేయ‌టం సాధ్య‌మేనా? అంటే.. సాయి ప‌ల్ల‌వి లాంటి అమ్మాయికి మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి.

ఒక్క హిట్ తోనే చుక్క‌లు చూపిస్తోంది.. రెమ్యున‌రేష‌న్ పెంచేసింది.. కండిష‌న్లు పెట్టేస్తుందంటూ కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ వ‌స్తున్నాయి ఫిదా పోరి మీద‌. మ‌రి.. ఆ విష‌యాన్నే అడిగితే.. కుండ బ‌ద్ధ‌లు కొట్టేస్తూ చాలా విష‌యాల్నే చెప్పేసింది.
మ‌ణిర‌త్నం.. దిల్ రాజు సినిమాల‌కు నో చెప్పిన మాట నిజ‌మేన‌ని.. అందులో త‌నకు ఆఫ‌ర్ చేసిన పాత్ర న‌చ్చ‌లేద‌ని.. అందుకే నో చెప్పిన‌ట్లుగా చెప్పేసింది.  త‌న‌కు న‌చ్చిన సినిమాలే చేస్తాన‌ని.. న‌చ్చ‌కుంటే ఎవ‌రు బ‌ల‌వంతం చేసినా చేయ‌న‌ని తేల్చేసింది. దిల్ రాజు క‌థ త‌న‌ను ఇంప్రెస్ చేయ‌లేద‌ని.. అందుకే చేయ‌లేన‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించింది. ఈ సినిమాకు రెమ్యున‌రేష‌న్ కార‌ణంగా నో చెప్పాన‌న్న‌ది నిజం కాదంది.

మ‌ణిర‌త్నం సినిమా ఆఫ‌ర్ కూడా పాత్ర న‌చ్చ‌కే నో చెప్పాన‌ని చెప్పింది. ఎవ‌రు ఏమ‌నుకున్నా త‌న దారి త‌న‌దేన‌ని.. క‌థ న‌చ్చితేనే సినిమా చేస్తాన‌ని లేకుంటే లేదంది.

తాను చాలా కండీష‌న్లు పెడ‌తాన‌న్న ఫిర్యాదు మీద స్పందిస్తూ.. "ఈ మాట ఏమిటో నాకిప్ప‌టికి అర్థం కాదు. ఎక్కువ ఇస్తామ‌ని.. గ్లామ‌ర్ గా క‌నిపించాలంటున్నారు. నా ముఖం మీద మొటిమ‌లు ఉన్నా తెర మీద అందంగానే క‌నిపిస్తున్నాను క‌దా?  గ్లామ‌ర్ అంటే అందంగా క‌నిపించ‌ట‌మే అంటారు. అలా అయితే నేను అంద‌గ‌త్తెనే. కొంద‌రి దృష్టిలో అందాల ఆర‌బోతే గ్లామ‌ర్ అనుకుంటారు. అలా అనుకొని కొంద‌రు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వారేం చెబుతున్నారో అర్థ‌మ‌య్యే నో చెప్పా. కొంద‌రు వ‌చ్చి క‌థ చెప్ప‌కుండా.. హీరో ఫ‌లానా న‌టిస్తారా? అని నేరుగా అడుగుతారు. నా దృష్టిలో క‌థే హీరో. మిగిలిన వారంతా న‌టులే. ఆ హీరో గురించి తెలుసుకోకుండా ఓకే  ఎలా చెబుతాను. నా ప‌క్క‌న ఎవ‌రన్న‌ది ప‌ట్టించుకోను. ఇవ‌న్నీ చెబితే కండిష‌న్లు అంటున్నారు. లిప్ లాక్ ల‌కు వ్య‌తిరేకం. ఇంట్లో పేరెంట్స్ కు మాటిచ్చా. సినిమాలు చేస్తానంటే కండిష‌న్లు పెట్టారు. వాటిని త‌ప్ప‌లేను. డాక్ట‌ర్ గా స్థిర‌ప‌డాల‌నుకుంటున్నాను.. నేను మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయిని. లిప్ లాక్ ల‌కు మా ఇంట్లో ఒప్పుకోరు" అంటూ సుదీర్ఘంగా చెప్పేసింది. అంతా వింటే సాయిప‌ల్ల‌వి మాట‌లు క‌న్వీన్స్ గా ఉండ‌ట‌మే కాదు.. ఫిదా అయ్యేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English