మంచు లక్ష్మి సినిమాలో ఒక స్పెషల్

మంచు లక్ష్మి సినిమాలో ఒక స్పెషల్

కొంచెం విరామం తర్వాత మంచు లక్ష్మీప్రసన్న మళ్లీ హీరోయిన్ అవతారమెత్తబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో విజయ్ యెలకంటి అనే కొత్త దర్శకుడు గత ఏడాది ఒక కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించింది మంచు లక్ష్మి. వైఫ్ ఆఫ్ రామ్.. ఇదీ మంచు లక్ష్మి కొత్త సినిమా పేరు. భానుమతి గారి మొగుడు.. మంగమ్మగారి మనవడు.. రావు గారబ్బాయి.. వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్.. ఇలా ఉండేవి ఒకప్పుడు టైటిళ్లు. ఐతే మధ్యలో ఈ ట్రెండు పోయింది. ఈ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ నటించిన సినిమాకు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు లక్ష్మి సినిమాకు ‘వైఫ్ ఆఫ్ రామ్’ అని నామకరణం చేశారు. ఇంతకీ ఈ సినిమాలో రామ్ ఎవరో చూడాలి మరి.

ఈ చిత్ర దర్శకుడు విజయ్ యెలకంటి రాజమౌళి దగ్గర శిష్యరికం చేయడం విశేషం. లక్ష్మితో అతను తీస్తున్నది ఒక వెరైటీ థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఈ చిత్రంలో మరో విశేషం ఉంది. ‘శ్రీమంతుడు’లో జాగో జాగోరే జాగో.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో చల్ చలో చలో.. ‘జనతా గ్యారేజ్’లో రాక్ ఆన్ బ్రో లాంటి పాటలతో సంగీత ప్రియుల్ని అలరించిన బాలీవుడ్ సింగర్ రఘు దీక్షిత్ ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ విషయం ఈ రోజే వెల్లడైంది. మొత్తానికి కాంబినేషన్ అయితే బాగానే కుదిరింది. మరి లక్ష్మికి వీళ్లయినా హిట్టిస్తారేమో చూడాలి. లక్ష్మి చివరగా లీడ్ రోల్ చేసిన ‘లక్ష్మీబాంబు’ వచ్చిన సంగతి తెలియదు. వెళ్లిన సంగతి తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English