నమితను కిడ్నాప్ చేశారంట

నమితను కిడ్నాప్ చేశారంట

‘సొంతం’ సినిమాతో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత తెలుగులో మూణ్నాలుగు సినిమాలు చేసిన నమిత.. ఆ తర్వాత తమిళంలోకి వెళ్లిపోయింది. అక్కడి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కొంచెం బొద్దుగా ఉండే హీరోయిన్లకు పట్టం కట్టే తమిళ ప్రేక్షకులు నమితను నెత్తిన పెట్టుకున్నారు. ఆమెకు గుడి కట్టేంతగా అభిమానం చూపించారు. ఐతే ఈ అభిమానం శ్రుతి మించి తనను కిడ్నాప్ చేసే వరకు వెళ్లిందంటూ తాను కిడ్నాప్ అయిన ఓ ఘటనను ఇప్పుడు నెమరు వేసుకుంది నమిత. 2009లో జరిగిన ఆ ఘటన గురించి నమిత ఏమందంటే..

నమిత ఒకసారి ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చేసరికి ఒక కారు డ్రైవర్ తన కోసమే వచ్చినట్లు చెప్పడంతో నిర్మాత పంపిన కారు అనుకుని తాను అందులో ఎక్కేశానని.. ఐతే కొంత దూరం వెళ్లాక అను వేరే రూటులో వెళ్తుండటంతో అనుమానం వచ్చిందని.. ఏదో తేడా జరగబోతోందని అర్థమైందని నమిత చెప్పింది. వెంటనే తన నిర్మాతకు ఫోన్లో మెసేజ్ పెడితే.. ఎయిర్ పోర్టు దగ్గర తన మనిషి ఎదురు చూస్తున్నట్లు చెప్పాడని అంది.

అప్పటికే ఆ కారు డ్రైవర్ తనను అనుమానాస్పదంగా చూస్తుండటంతో విషయం అర్థమైందని.. నిర్మాత పోలీసుల్ని అలర్ట్ చేయడంతో వాళ్లు తనను ట్రేస్ చేసి కాపాడినట్లు నమిత చెప్పింది. తనను కిడ్నాప్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారని.. వాళ్లు కాపాడకపోయి ఉంటే తన పరిస్థితి ఏమయ్యేదో అని నమిత ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలే తన స్నేహితుడు వీరను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోయిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు