మామ‌కు స‌మంత అలా షాకిచ్చింద‌ట‌!

మామ‌కు స‌మంత అలా షాకిచ్చింద‌ట‌!

ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట‌ను చెప్పుకొచ్చారు టాలీవుడ్ మ‌న్మ‌దుడు అక్కినేని నాగార్జున‌. ఈసారి సంక్రాంతికి ఆయ‌న చాలా హ్యపీగా ఉన్నారు. చిన్న‌కొడుకు అఖిల్ లేటెస్ట్ మూవీ హ‌లో ఇబ్బంది పెట్ట‌కుండా ఓకే కావ‌టం హాయిగా ఊపిరిపీల్చుకునే ప‌రిస్థితి.

ఇక‌.. పెద్ద కొడుకు పెళ్లి.. కొత్త కోడ‌లు స‌మంత ఇంట్లోకి అడుగు పెట్టిన వేళ‌.. అక్కినేని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా అక్కినేని కుటుంబం అన్న‌పూర్ణ స్టూడియోలో క‌లిశారు. అన్న‌పూర్ణ స్టూడియో స్టార్ట్ చేసి 42 ఏళ్లు అయిన వేళ‌.. వ‌ర్క‌ర్స్ అంద‌రికి కొత్త కోడ‌లు స‌మంత భోజ‌నాలు పెట్టిందని చెప్పారు. ఈ సంద‌ర్భంగా తామంతా క‌లిసి భోజ‌నం చేసిన‌ట్లు చెప్పారు.

ఆ సంద‌ర్భంగా ఏవేవో జోక్స్ త‌మ మ‌ధ్య‌లో వ‌చ్చాయ‌ని.. స‌మంత అయితే.. మై హ‌స్బెండ్ ఈజ్ ది బెస్ట్ అని వ్యాఖ్యానించింద‌ని.. దానికి తామంతా షాక్ తిన్నామ‌ని న‌వ్వేశారు. మేమంతా మా భార్య‌ల‌కు మంచి హ‌స్బెండ్స్ కాదా? అని అడిగామ‌ని.. దానికి స‌మంత  రియాక్ట్ అవుతూ.. లేదు..లేదు.. మై హ‌స్బెండ్ ఈజ్ ది బెస్టెస్ట్ అని చెప్పి అంద‌రిని ఆట‌ప‌ట్టించిన ముచ్చ‌ట‌ను చెప్పారు. అక్కినేని వారింట సంక్రాంతి పండుగ సంద‌డి ఎంత‌లా ఉందో నాగ్ త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశారుగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు