నో డౌట్‌.. మంచు ల‌క్ష్మి సంక్రాంతి అదిరిందిగా!

నో డౌట్‌.. మంచు ల‌క్ష్మి సంక్రాంతి అదిరిందిగా!తెలుగువారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఒక్కోళ్లు ఒక్కోలా చేసుకుంటారు. సినీ న‌టి మంచు ల‌క్ష్మి కాస్త డిఫ‌రెంట్ గా చేయ‌ట‌మే కాదు.. ఆమె ఆలోచ‌న అదిరిపోయేలా ఉంద‌ని చెప్పాలి. ఆమె సంక్రాంతి సంబ‌రాల గురించి వింటే ఫిదా కావాల్్సిందే.

సిటీలోని ప‌లు స్కూళ్ల‌కు చెందిన విద్యార్థుల్ని త‌న ఇంటికి ఆహ్వానించిన మంచుల‌క్ష్మి వారికి భోజ‌నం పెట్ట‌ట‌మే కాదు.. వారి కోసం ప్ర‌త్యేకంగా బ‌ట్ట‌లు కుట్టించారు. ఇక్క‌డే మ‌రో విశేషం ఉంది. అంద‌రు పిల్ల‌ల‌కు ఎలాంటి బ‌ట్ట‌లైతే కుట్టించారో.. త‌న గారాల ప‌ట్టి యాపిల్‌కు అలాంటి బ‌ట్ట‌లే కుట్టించి ఆమెకు అవే బ‌ట్ట‌లు వేసి ఈ కార్య‌క్ర‌మంలో పార్టిసిపేట్ చేయించారు.

త‌న‌కెంతో ఇష్ట‌మైన సంక్రాంతి పండ‌గ‌ను త‌న‌కెంతో ఇష్ట‌మైన పిల్ల‌ల‌తో క‌లిసి చేసుకోవ‌టానికి మించిన ఆనందం ఏముంటుంద‌ని ప్ర‌శ్నించారు. టీచ్ ఫ‌ర్ ఛేంజ్ స‌హ‌కారంతో 50 పాఠ‌శాల‌ల్లో చ‌దువుప‌రంగా బాగా చ‌దువుతున్న పిల్ల‌ల్ని ఇంటికి పిలిపించాన‌ని.. వారంద‌రికి డిజైన‌ర్ దుస్తులు అందించిన‌ట్లు చెప్పారు. వారికి తానే స్వ‌యంగా భోజ‌నం వ‌డ్డించ‌టం..  చ‌దువు అవ‌స‌రం ఏమిటో తెలిసేలా వారికి చెప్ప‌టం చాలా హ్యాపీగా అనిపించింద‌ని చెప్పింది. పిల్ల‌ల‌తో క‌లిసి ఫోటోలు దిగి.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఏమైనా.. మిగిలిన వారికి భిన్నంగా మంచు ల‌క్ష్మి సంక్రాంతి పండుగ సాగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు