అమీ.. ఈ ముద్దు మామూలూదే కదా?

అమీ.. ఈ ముద్దు మామూలూదే కదా?

బ్రిటన్ సోయగం అమీ జాక్సన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా నిలుస్తూనే ఉంటుంది. బికినీ ఫోటోల నుంచి అనేక సంచలనాలను షేర్ చేసే ఈ భామ.. ఇప్పుడు జనాలకు పెద్ద పజిల్ నే వదిలింది.

రీసెంట్ గా అమీ జాక్సన్ తులు వెళ్లింది. ఇక్కడ ఎంజాయ్ చేయడం ఈమెకు కొత్తేమీ కాదు. ఇప్పటికి పలుమార్లు వెళ్లి.. అక్కడ తాను ఏ స్థాయిలో సంబరాలు చేసుకుందో చూపించేసింది. ఇప్పుడు కూడా తులులో ఓ వ్యక్తికి స్ట్రాంగ్ కిస్ ఇస్తూ ఒక ఫోటో షేర్ చేసింది అమీ జాక్సన్. ఈ ఫోటో చూడగానే చాలామంది ఛీఛీ అనేస్తూ కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇందుకు కారణం అమ్మడు ఓ అమ్మాయికి ముద్దు పెట్టినట్లుగా కనిపించడమే. ఇదే పర్సన్ తో గతంలో కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయ్ కానీ.. వాటిలోనూ ఇతని ఫోటో కనిపించలేదు. అందుకే జనాలు ఈ వ్యక్తిని అమ్మాయి అనేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ వెనుక నుంచి చూస్తే అలాగే కనిపిస్తుండడం గమనించాలి.

అయితే అక్కడుంది అమ్మాయి కాదని.. సెబాస్టియన్ అనే  డిజె అని కొందరు చెబుతున్నారు. ఇతడు అమీ జాక్సన్ ప్రియుడు అని అంటున్నారు ఫ్యాన్స్. మరి నిజంగానే ఇతడు సెబాస్టియన్ యేనా కాదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరి ఈ విషయంలో అమీ జాక్సన్ అయినా నిజం చెబుతుందో.. లేకపోతే బాగా క్లోజ్ అయిన నా స్నేహితురాలికి ముద్దు పెట్టానంతే.. అంటూ ఆఖర్లో కబుర్లు చెబుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English