ఎట్టకేలకు రాట్నం కోసం వచ్చిన నాగ్

ఎట్టకేలకు రాట్నం కోసం వచ్చిన నాగ్

ఓ సినిమాను నిర్మించడమే కాదు.. దగ్గరుండి మరీ అన్ని పనులు చూసుకునే నిర్మాతలు అరుదుగా ఉంటారు. అలా తమ నిర్మాణ సంస్థ పేరు ప్రఖ్యాతులను కొనసాగిస్తున్న వారిలో అక్కినేని నాగార్జున కూడా ఉంటారు. మంచి కాన్సెప్టులతో మూవీస్ తీయడమే కాదు.. తన స్టార్ ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి ప్రమోట్ చేయడం ఈయన స్టైల్.

కానీ సంక్రాంతి సందర్భంగా విుదుల కానున్న రంగులరాట్నం విషయంలో మాత్రం నాగ్ ధోరణి ఆశ్చర్యం కలిగించింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయి చాలా కాలం అయినా.. నాగ్ మాత్రం అసలు కనిపించకపోవడం అనేక వాదనలకు దారి తీసింది. దీంతో ఎట్టకేలకు రంగులరాట్నం ప్రమోషన్స్ కోసం కదిలారు నాగార్జున. అన్నపూర్ణ బ్యానర్ పై రూపొందిన రంగుల రాట్నం.. తమ బ్యానర్ విలువను పెంచేలా ఉంటుందని అన్నారు. "ఈ సంక్రాంతి కి అన్నపూర్ణ స్టూడియోస్ అందిస్తున్న తియ్యటి బొబ్బట్టు లాంటి సినిమా 'రంగులరాట్నం'" అంటూ ప్రశంసలు కురిపించారాయన. ఇప్పటివరకూ రంగుల రాట్నం ప్రమోషన్స్‌ కు నాగార్జున ఎందుకు రావడం లేదో అనుమానాలు ఉండేవి.

ఇప్పుడు స్వయంగా నాగ్ రంగంలోకి దిగేయడంతో అనేక రూమర్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి వచ్చిన ఇతర సినిమాలపై టాక్ పాజిటివ్ గా లేకపోవడం చూస్తుంటే.. ఈ పొంగల్ విజేతగా నిలిచేదుకు రంగులరాట్నంకు అన్నీ కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ అడ్వాంజేట్ ను రాజ్ తరుణ్ ఎలా ఉపయోగించుకుంటాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English