భోగికి కృష్ణుడు.. సంక్రాంతికి అర్జునుడు

భోగికి కృష్ణుడు.. సంక్రాంతికి అర్జునుడు

తెలుగు వారికి అది పెద్ద పండగ సంక్రాంతే. ఈ సీజన్లో సినిమాల సందడి కూడా మామూలుగా ఉండదు. ఇంకే సీజన్లో లేని స్థాయిలో పెద్ద పెద్ద సినిమాలు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రేసులో దిగుతుంటాయి ఈ సీజన్లో. ఈసారి కూడా సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో నిలిచాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాల్ని కూడా అభిమానులతో పెద్ద ఎత్తున పంచుకోవడం మామూలే. ఈసారి కూడా ఇలాంటి విశేషాలు చాలానే చూడబోతున్నారు. ఈ రేసులోకి కొత్తగా నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ కూడా వచ్చింది. ఈ సంక్రాంతికి తమ సినిమా నుంచి ఒకటికి మూడు విశేషాలు పంచుకోబోతున్నట్లు నాని వెల్లడించడం విశేషం.

ముందుగా భోగి రోజు ఈ సినిమాలో కృష్ణ పాత్రలో తన ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని.. తర్వాత సంక్రాంతి రోజు అర్జున్ పాత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తామని నాని చెప్పాడు. ఐతే సర్ప్రైజ్ అక్కడితో ఆగిపోదు. కనుమ రోజు ఈ సినిమాలోంచి ఒక పాటను కూడా లాంచ్ చేస్తారట. తాము ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్స్.. సాంగ్స్ చూసుకుని చాలా సంతోషించామని.. సినిమా రిలీజ్‌కు ఇంకా మూణ్నాలుగు నెలలు సమయం ఉండగానే ఈ విశేషాల్ని ప్రేక్షకులకు ఎందుకు చూపించకూడదని భావించి ఇంత ముందుగా వాటిని లాంచ్ చేస్తున్నామని నాని తెలిపాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో విడుదలవుతుందని నాని తెలిపాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్.. రుస్కార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English