విద్యా బాల‌న్ కు కేతిరెడ్డి వార్నింగ్!

విద్యా బాల‌న్ కు కేతిరెడ్డి వార్నింగ్!

ఎన్టీఆర్ బ‌యోపిక్ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వార్త‌ల్లో నిలిచిన సంగతి తెలిసిందే. త‌న చిత్రాన్ని ల‌క్ష్మీ పార్వ‌తి అడ్డుకోవాల‌ని చూస్తోంద‌ని, అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళతాన‌ని కేతిరెడ్డి గ‌తంలో చెప్పారు. తాజాగా, బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ పై కేతి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ సినిమాలో మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో  విద్యాబాల‌న్న న‌టించ‌బోతున్న నేప‌థ్యంలో...ఆమె ఆ పాత్ర‌కు స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఆ పాత్ర‌లో న‌టించే ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకోవాల‌ని విద్యా బాల‌న్ కు స‌ల‌హా ఇచ్చారు. విద్యా బాల‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

'ఇందిర: ఇండియాస్ ప‌వ‌ర్‌ఫుల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌' పేరుతో ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి సాగ‌రికా ఘోష్ రాసిన న‌వ‌లను వెబ్‌సిరీస్ లేదా సినిమాలా తెర‌కెక్కించ‌బోతున్నారు. అందులో, ఇందిరాగాంధీ పాత్రలో విద్యాబాలన్ నటించనుంది. ఇందిర వంటి  గొప్ప నాయకురాలి పాత్రలో డ‌ర్టీ పిక్చ‌ర్ లో ఫేం విద్యాబాలన్ నటించడంపై కేతిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆ పాత్ర‌లో విద్యా న‌టించ‌డం ప‌ట్ల ఇందిరా అభిమానులను కలత చెందుతున్నార‌ని, విద్యా ఆ పాత్ర‌లో న‌టించే  ప్రయత్నాలను ఆపాల‌ని కోరారు. లేకుంటే, వారి ఆగ్రహానికి గురికాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దేశ సమైక్యత సమర్ధత కోసం ప్రాణాల‌ర్పించిన ఒక మహిళానేత పాత్రలో విద్యా బాల‌న్ ను ఊహించుకోవడం కష్టమన్నారు. అయితే, కళాకారులు ఏ పాత్ర అయినా పోషించవచ్చని, కానీ గతంలో వారు పోషించిన పాత్రల ప్రభావం భ‌విష్య‌త్తులో న‌టించే పాత్రల‌పై ఉంటుందన్నారు. ఇందిర‌పై తీయ‌బోయే సినిమాలో పాత్ర‌ల ఎంపిక‌పై మా డిమాండ్ ను ఆ చిత్ర నిర్మాత గుర్తుంచుకోవాలన్నారు. నరేంద్రమోదీ పాత్రలో శక్తికపూర్ నటిస్తే ప్రజలు అంగీక‌రించ‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు