చర్చ్ దగ్గర అమ్మను గుర్తుచేసుకున్న సామ్

చర్చ్ దగ్గర అమ్మను గుర్తుచేసుకున్న సామ్

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా మదిలో చిరకాలం నిలిచిపోతాయి. సెలబ్రిటీలు స్టార్లు అయినంత మాత్రాన వారేమీ మనుషులు కాకుండా పోరు. వారికీ అనేక మధుర జ్ఞాపకాలు ఉంటాయి. టాలీవుడ్ బ్యూటీ.. తెలుగింటి కోడలు అక్కినేని సమంత ఇప్పుడు అలాంటి మధుర జ్ఞాపకాలనే మనతో పంచుకుంటోంది.

సోషల్ మీడియాలో బోలెడన్ని కబుర్లు చెప్పేసే సమంత.. పర్సనల్ విషయాలను కూడా బాగానే చెబుతుంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ హైద్రాబాద్ లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న ఆల్ సెయింట్స్ చర్చికి వెళ్లింది. అక్కడి ప్రశాంతమైన వాతావరణం నుంచి ఓ ఫోటో కూడా తీసి నెట్ లో పోస్ట్ చేసిన ఈ భామ.. ఈ ప్రార్ధనాలయం చూసిన తర్వాత చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుంది. 'ఈ చర్చికి వచ్చిన తర్వాత.. చిన్నపుడు మా అమ్మ నన్ను చర్చికి లాక్కు రావడం గుర్తొచ్చింది. ప్రతీ బుధవారం.. శనివారం.. ఆదివారం తీసుకొచ్చేది మా అమ్మ' అంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది సమంత.

'అపుడు చర్చికి రావడాన్ని తెగ ద్వేషించేదాన్ని. కానీ ఆమె ప్రార్ధనలే నన్ను ఈ స్థితికి చేర్చాయని.. నన్ను బతికించాలని ఇపుడు అర్ధమైంది.. అద్భుతమైన వ్యక్తి మా అమ్మ' అని చెబుతోంది సమంత. ఒకవైపు అమ్మపై ప్రేమ.. మరోవైపు చర్చిలో ప్రార్ధనలు.. ఇంకోవైపు తన ఔన్నత్యం.. అన్నీ కలిపి ఒకే పోస్ట్ లో చెప్పిన సమంత తెలివితేటలు అద్భుతం కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English