మరో వివాదంలో ఇరుక్కున్న బండ్ల

మరో వివాదంలో ఇరుక్కున్న బండ్ల

బండ్ల గణేష్ కు వివాదాలు కొత్తేమీ కాదు. కేసులు కూడా కొత్తేమీ కాదు. గతంలో పలు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి లీడ్ లోకి వచ్చిన ఈ ప్రొడ్యూసర్.. వివాదాలలో మునిగిపోయాడు. ప్రస్తుతం సినిమాలు నిర్మించకపోయినా.. ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే.

తాజాగా బండ్ల గణేష్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసును ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫరూక్ నగర్ మండలానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్ర అనే వ్యక్తికి చెందిన ఓ ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడట బండ్ల గణేష్. అయితే.. ఈ డీల్ కోసం అడ్వాన్స్ అమౌంట్ చెల్లించేందుకు బదులుగా.. ఆ ఆస్తిపై ఉన్న బ్యాంక్ లోన్ ను రీపేమెంట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట బండ్ల. అయితే.. అగ్రిమెంట్ కు అనుగుణంగా బ్యాంకుకు పేమెంట్ చేయకపోవడంతో.. చివరకు ఆ ఆస్తులను బ్యాంక్ అధికారులు సీజ్ చేశారని తెలుస్తోంది.

అయితే.. ఈ వివాదంలో మాటా మాటా పెరగడంతో.. బండ్ల గణేష్.. అతని సోదరుడు శివబాబు.. ఇద్దరూ దిలీప్ చంద్ర దంపతులను దుర్భాషలు ఆడారట. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కులం పేరుతో దూషించాడని కేసు పెట్టడం.. ఇది నిజమే అంటూ దర్యాప్తు చేసిన పోలీసులకు స్థానికులు చెప్పడంతో.. బండ్ల అతని సోదరుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English