అయ్యో అయ్యయ్యో.. వెంకీ మిస్సయ్యాడే

అయ్యో అయ్యయ్యో.. వెంకీ మిస్సయ్యాడే

ఓ సినిమాకి టైటిల్ చాలా కీలకం. జనాల్లోకి తేలికగా వెళ్లిపోయే టైటిల్ ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్ తెగ ట్రై చేస్తారు. ఓ టైటిల్ అనుకున్నపుడు.. దాన్ని వీలైనంత త్వరగా రిజిస్టర్ చేయించుకోకపోతే.. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మూవీకి ఇలాంటి ఇబ్బందే ఎదురవుతోంది.

తేజ దర్శకత్వంలో ఓ మూవీని అధికారికంగానే ప్రారంభించాడు వెంకీ. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫిబ్రవరిలో ప్రారంభించే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా.. పొలిటికల్ యాంగిల్ లో ఈ కథ నడుస్తుందనే టాక్ ఉంది. అయితే.. వెంకీ-తేజ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 'ఈ నగరానికి ఏమైంది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. జనాల నోళ్లలో కూడా ఎక్కువగా నానుతున్న పదం కావడంతో.. జనాలు కూడా తొందరగానే కనెక్ట్ అయ్యారు.

కానీ వెంకీ కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించేలోపే.. జరగాల్సినది జరిగిపోయింది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్.. తన కొత్త సినిమాకు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు. అయితే.. ఈ చిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే తెరకెక్కించబోతుండడమే ఆశ్చర్యకరం. ఇప్పటికే టైటిల్ రిజిస్టర్ చేసేసుకోవడమే కాదు.. వెళ్లిపోమాకే ఫేమ్ విష్వక్ సేన్.. అనీషా ఆంబ్రోస్ జంటగా కామెడీ జోనర్ లో ఈ సినిమా ఉంటుందని చెప్పేశాడు తరుణ్ భాస్కర్. దీంతో ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది' టైటిల్ ను వెంకీ మిస్ అయిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English