సంక్రాంతి రేసులో మంచు లక్ష్మి కూడా

సంక్రాంతి రేసులో మంచు లక్ష్మి కూడా

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల మధ్యనే బోలెడంత పోటీ ఉంది. నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో.. చివరకు ఏ సినిమా విజేతగా నిలుస్తుందనే ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు కొత్త సినిమాలు.. సెట్స్ పై ఉన్న సినిమాలకు సంబంధించిన న్యూస్ ను కూడా పండుగకే విడుదల చేస్తూ.. ఆసక్తిని పెంచుకుంటున్నారు సినిమా జనాలు.

ఈ సంక్రాంతి రేసులో మంచు ఫ్యామిలీ బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేస్తోంది. ఇప్పటికే మంచు విష్ణు తన కొత్త సినిమా సంగతులు చెప్పేశాడు. ఇప్పుడు మంచు వారసురాలు లక్ష్మి కూడా సంక్రాంతికి కొత్త కబుర్లు చెబుతానని అంటోంది. పండుగ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ టైటిల్ రివీల్ చేస్తానని చెప్పింది మంచు లక్ష్మి. 'సంక్రాంతి పండుగ నాడు.. అంటే జనవరి 15న ఉదయం 10 గంటలకు నేను నా కొత్త సినిమా టైటిల్ ను విడుదల చేయబోతున్నాను. అప్పటి వరకూ వేచి ఉండండి. మీ అందరి ప్రేమ నాకు కావాలి' అని చెప్పింది మంచు లక్ష్మి.

2015లో వచ్చిన దొంగాట తర్వాత మళ్లీ నిర్మాతగా అదృష్టం పరీక్షించుకుంటున్న లక్ష్మీ ప్రసన్న.. ఇప్పుడు విజయ్ యెలకంటి అనే కొత్త దర్శకుడితో ఓ మూవీ చేస్తోంది. మంచు ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై.. పీపుల్స్ మీడియా గ్రూప్ భాగస్వామ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఆదర్శ్ బాలకృష్ణ.. సమ్రాట్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రివెంజ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ను.. పండుగ సందర్భంగా మంచు లక్ష్మి ప్రకటించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు