అందాల విందు.. అందుకేనా బిందు?

అందాల విందు.. అందుకేనా బిందు?

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కెరీర్ ను కొనసాగించడం కష్టమైన విషయమే. ఎంతసేపూ పక్క చూపులు చూసే మన ఇండస్ట్రీలో.. పరాయి భాషల భామలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అడపాదడపా మినహాయిస్తే.. తెలుగు భామలకు హీరోయిన్ ఛాన్సులు ఇచ్చే మేకర్స్ కనిపించడం అరుదు. ఏవో ఒకట్రెండు పాత్రలకు మినహాయిస్తే.. తెలుగు నటులను కూడా తీసుకోవడం లేదు. ఇలాంటి సిట్యుయేషన్ లో కూడా 9 ఏళ్లుగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది చిత్తూరు జిల్లా భామ బిందు మాధవి.

ఆవకాయ్ బిర్యానీ అంటూ తెరంగేట్రం చేసిన ఈ భామ.. బంపర్ ఆఫర్.. రామరామకృష్ణ.. పిల్ల జమీందార్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా తమిళ్ మూవీస్ కే పరిమితం అయిపోయింది లెండి. అయితే.. మన జనాలు మర్చిపోయిన బంపర్ ఆఫర్ బ్యూటీ బింధు మాధవి.. ఇప్పుడు ఏదో విధంగా తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా ఉమెన్ ఎక్స్ క్లూజివ్ కవర్ పేజ్ పై మెరిసిన ఈ సుందరాంగి.. రకరకాల భంగిమలతో ఫోటో సెషన్ చేసేసింది.

సోయగాలు కనిపించేలా డ్రెస్సులు.. తెగువ చూపించేలా పోజులు.. అందాన్ని ప్రదర్శించేలా ఫోటోలు.. అన్నీ కలిపి బిందుమాధవి ఏ రేంజ్ లో షోకులను ఎగ్జిబిట్ చేయగలదో అనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియచేస్తున్నాయి. ఇలాంటి అందాన్ని ఇన్నేళ్లూ మిస్ అయ్యామా అని తెలుగు ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ మేకర్స్ కూడా ఫీలయిపోయే రేంజ్ అందాలను చూపించేసింది బిందు మాధవి. మరి సడెన్ గా ఈ భామ గ్లామర్ రూట్ పట్టడం.. ఛాన్సుల కోసమే అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English