బాలకృష్ణ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయా

బాలకృష్ణ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయా

టాలీవుడ్ కి మలయాళీ భామల దిగుమతి కంటిన్యూ అవుతోంది. ముంబై సుందరి అయినా మలయాళ చిత్రాలలో సత్తా చాటుతున్న నటాషా దోషీ.. ఇవాల్టి రిలీజ్ జైసింహాలో ఓ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో అరంగేట్రమే నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో కావడంపై తెగ ఉత్సాహపడిపోతోంది నటాషా.

బాలయ్య ఈమెకు బోలెడన్ని నేర్పించేశారట. అలాగని ఆయనేమీ దగ్గరుండి నేర్పించలేదు. ఆయన్ని చూసి ఈమే ఏకలవ్య శిష్యురాలి మాదిరిగా నేర్చుకుందట. ఇంత వయసులో కూడా బాలకృష్ణ ఎనర్జీ.. సెట్స్ పై ఆయన చూపే కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోయానని అంటోంది నటాషా దోషీ. అలాంటి డెడికేషన్ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అంటున్న ఈ భామ.. ఆయన ప్రవర్తనను దగ్గరుండి చూసే అవకాశం రావడంతో.. చాలానే నేర్చుకున్నానని అంటోంది. మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్కువ కావడంతో.. బాలయ్యతో ఎక్కువ రోజులు జర్నీ చేసే అవకాశం వచ్చిందని అంటోంది నటాషా.

జైసింహా మూవీ తర్వాత తనకు టాలీవుడ్ లో సుస్థిర స్థానం లభిస్తుందని నటాషా దోషీ చాలానే హోప్స్ పెట్టుకుంది. సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల కావడంతో.. బాలయ్యకు సెంటిమెంట్ పరంగా కూడా అచ్చొచ్చే అవకాశం ఉంది. మరోసారి సింహగా తన సత్తా చాటబోతున్నారు నందమూరి బాలకృష్ణ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English