మళ్లీ మొహం చాటేస్తున్న మహేష్

మళ్లీ మొహం చాటేస్తున్న మహేష్

బ్రహ్మోత్సవం.. స్పైడర్ అంటూ వరుసగా రెండు సినిమాలు నిరుత్సాహపరచడంతో.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మాంచి ఆకలి మీద ఉన్నారు. సూపర్ స్టార్ నుంచి హిట్టు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఆకలిని తీర్చాలనే పట్టుదలతో ఉన్న మహేష్.. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా కొత్త షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభించగా.. ఇప్పటికే రిలీజ్ డేట్ విషయంలో ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 27న భరత్ అనే నేను మూవీని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అంతవరకూ ఓకే కానీ.. ఈ మూవీకి ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. గతంలో న్యూఇయర్ కి ఏదో ఒకటి రిలీజ్ చేసేవాడు మహేష్. బ్రహ్మోత్సవం తర్వాత అది కూడా ఆపేశాడు. ఇప్పుడు భరత్ అనే నేను విషయంలో కూడా అదే సెంటిమెంట్ తో.. కొత్త ఏడాది ప్రారంభం రోజున ఫస్ట్ లుక్ ఇవ్వలేదని.. సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అంతా భావించారు.

అయితే.. సంక్రాంతి పండుగకు కూడా మహేష్ మూవీకి ఫస్ట్ లుక్ రావడం లేదట. మూవీ రిలీజ్ కి ఇంకా 100 రోజులకు పైగా గ్యాప్ ఉండడంతో.. ఇప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ ఉన్న మాట వాస్తవమే అయినా.. ఇప్పటి నుంచి అప్పటివరకూ టెంపో మెయింటెయిన్ చేయడం క్లిష్టమైన విషయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఎప్పుడు ఫస్ట్ లుక్ ఇస్తారనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదు భరత్ అనే నేను మేకర్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English