స్పైడర్ విలన్.. అమ్మాయిలను వేధించాడట

స్పైడర్ విలన్.. అమ్మాయిలను వేధించాడట

స్పైడర్ మ్యాన్ మూవీస్ లో విలన్ గా నటించిన బాలీవుడ్ యాక్టర్ జేమ్స్ ఫ్రాంకో.. తన నటనతో మెప్పించాడు. అనేక సినిమాల్లో లీడ్ యాక్టర్ గా చేసిన జేమ్స్.. రీసెంట్ గా ది డిజాస్టర్ ఆర్టిస్ట్ మూవీకి బెస్ట్ యాక్టర్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నాడు.

ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు ఇతడిపై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ఇతడిపై ఏకంగా ఐదుగురు మహిళలు ఆరోపణలు చేస్తుండగా.. వీరిలో నలుగురు అతని దగ్గర యాక్టింగ్ స్కూల్ స్టూడెంట్స్. మరొకరు అయితే.. ఇతనికి మెంటార్ కూడా. వారి కెరీర్ ఎదిగేందుకు ఛాన్సులు ఇప్పిస్తానంటూ చెప్పి.. లైంగికంగా ఉపయోగించుకుంటున్నాడు అని జేమ్స్ ఫ్రాంకో పై ఆరోపణలు వస్తున్నాయి. సెలబ్రిటీలు కాని మహిళలను ఇలా ఉపయోగించుకునే కల్చర్ పెరుగుతోందని.. దీనికి అడ్డుకట్ట పడాలని ఆమె చెబుతోంది.

ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించే సమయంలో.. మర్మాంగాలను కవర్ చేసేలా ప్లాస్టిక్ కవర్స్ ను ఉపయోగిస్తారు. అయితే.. ఇతను వీటిని తొలగించేసి మరీ షూటింగ్ చేస్తుంటాడని చెబుతున్నారు. అలాగే.. ఇతను సెట్స్ లో ఉండగా ఎవరూ టాప్ లెస్ గా నటించేందుకు సిద్ధంగా ఉండరన్నది మరో ఆరోపణ. ఆయా షూటింగ్ స్పాట్స్ లో మహిళలు కనిపించకపోతే.. వెర్రెత్తిపోతాడట జేమ్స్ ఫ్రాంకో. ఈ తరహా క్యాస్టింగ్ కౌచ్ ప్రవర్తనను సమర్ధించకపోయినా.. కెరీర్ కోసం కొందరు ఇలాంటివి స్వచ్ఛందంగానే చేస్తుంటారని పలువురు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు