‘పెళ్లిచూపులు’ తర్వాత.. ‘ఈ నగరానికి ఏమైంది’

‘పెళ్లిచూపులు’ తర్వాత.. ‘ఈ నగరానికి ఏమైంది’

2016లో ‘పెళ్లిచూపులు’ సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు తరుణ్ భాస్కర్. పెద్దగా పేరు లేని హీరో హీరోయిన్లతో చాలా తక్కువ బడ్జెట్లో అతను తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్టయింది. ఈ సినిమాతో ఎందరో యువ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాడు తరుణ్. ఇలాంటి హిట్ కొట్టాక వెంటనే ఇంకో సినిమా ఒప్పేసుకుని చకచకా పూర్తి చేసి రిలీజ్ చేస్తుంటారు కొత్త దర్శకులు. ఐతే తరుణ్ మాత్రం ఆ రూట్ ఫాలో కాలేదు. రెండో సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు. ఈ మధ్యే ఆ సినిమాను మొదలుపెట్టాడు. చడీచప్పుడు లేకుండా ఆ చిత్ర షూటింగ్ సాగుతోంది. ఇప్పుడీ సినిమా గురించి ఒక అప్ డేట్ బయటికి వచ్చింది. తరుణ్ రెండో సినిమాకు ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

ఈ టైటిల్‌ ఇంతకముందే ఒకసారి ప్రచారంలోకి వచ్చింది. వెంకటేష్ సినిమాకు ఈ టైటిల్ పెడతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు తరుణ్ ఈ టైటిల్ వాడుకుంటున్నాడు. ‘పెళ్లిచూపులు’ సినిమాను రిలీజ్ చేసిన సురేష్ బాబే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ కొత్తవాళ్లే ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘పెళ్లిచూపులు’ తరహాలోనే తక్కువ బడ్జెట్లో.. తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేశాడు తరుణ్. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్ ఈ సినిమా అని.. కొంచెం థ్రిల్లర్ లక్షణాలు కూడా ఉంటాయని అంటున్నారు. త్వరలోనే టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలని చూస్తున్నారు. మరి ‘పెళ్లిచూపులు’ అందరినీ సర్ప్రైజ్ చేసిన దర్శకుడు ఈసారి ఎలా మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు