పవన్, త్రివిక్రమ్ జేబులకు చిల్లు?

పవన్, త్రివిక్రమ్ జేబులకు చిల్లు?

‘అజ్ఞాతవాసి’ కాపీ వివాదం విడుదలకు నాలుగు రోజుల ముందే ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ రీమేక్ రైట్స్ కొని హిందీలో సినిమా తలపెట్టిన టీ సిరీస్ వాళ్లతో రూ.70 లక్షలకు సెటిల్మెంట్ జరిగినట్లు వార్తలొచ్చాయి. దీంతో కథ సుఖాంతమైందని భావించారు. కానీ నిన్న ‘అజ్ఞాతవాసి’ సినిమా చూసిన ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సాలీ పెట్టిన ట్వీట్ చూస్తే ఈ ఇష్యూను తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కాబట్టి.. సెటిల్మెంట్ వేరేలా జరగాలన్నట్లుగా అతను వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ‘అజ్ఞాతవాసి’ టీంకు మళ్లీ తలపోటు ఖాయమని అంటున్నారు.

స్టోరీని కాపీ కొట్టినందుకు మరింత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి రావచ్చేమో అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఎవరు చెల్లిస్తారో చూడాలి. ఒక సినిమాకు బాధ్యుడు నిర్మాతే కాబట్టే రాధాకృష్ణే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ న్యాయంగా చూస్తే సినిమా తీసేందుకు భారీగా పారితోషకం పుచ్చుకున్న దర్శకుడే కథను కాపీ కొట్టినందుకు ఫలితం అనుభవించాలి. మరో నిర్మాత అయితే దర్శకుడినే బాధ్యుడిని చేద్దుడేమో. కానీ త్రివిక్రమ్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం దృష్ట్యా మరింత పరిహారం చెల్లించాల్సిన స్థితిలో రాధాకృష్ణ ఏం చేస్తాడో చూడాలి. ఆయన ‘అజ్ఞాతవాసి’ ద్వారా అందుకున్న లాభం కంటే దర్శకుడు త్రివిక్రమ్.. హీరో పవన్ కళ్యాణ్‌లే ఎక్కువ ఆర్జించారన్నది స్పష్టం. అసలే ‘అజ్ఞాతవాసి’కి టాక్ ఏమంత బాగా లేదు. బయ్యర్ల పెట్టుబడి తిరిగొస్తుందా అన్నది సందేహంగానే ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతకు అందరూ పూర్తి డబ్బులు కట్టకపోవచ్చు. కట్టినా కొంత మేర వెనక్కి ఇవ్వాల్సి రావడమో.. లేదా తర్వాతి సినిమాకు సర్దుబాట్లు చేయడమో చేయాలి. కాబట్టి నిర్మాత వేరే నష్టాల్ని భరించలేడు. కాబట్టి పరిహారం చెల్లించాల్సి వస్తే.. పవనో త్రివిక్రమో తమ పారితోషకాలు కొంత వెనక్కి ఇవ్వక తప్పదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English