ఆ బహుమతి బాలయ్యకూ ఇచ్చారు

ఆ బహుమతి బాలయ్యకూ ఇచ్చారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’కి అర్ధరాత్రి 1 గంట తర్వాత ఉదయం 10 గంటల లోపు స్పెషల్ షోలు వేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని బయ్యర్లు బాగానే ఉపయోగించుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని పట్టణాలు.. సిటీల్లో.. చిన్న చిన్న ఊర్లలో కూడా ముందు రోజు అర్ధరాత్రి నుంచే షోలు మొలయ్యాయి. రెండో రోజు కూడా ఈ ఒరవడి కొనసాగింది. ఇప్పుడు ఇదే అవకాశాన్ని నందమూరి బాలకృష్ణ సినిమా ‘జై సింహా’కు కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని కూడా రోజులో 24 గంటలూ ఎన్ని షోలైనా ప్రదర్శించుకోవచ్చు. గురువారం అర్ధరాత్రి దాటాక ఆంధ్రప్రదేశ్ అంతటా ‘జై సింహా’ స్పెషల్ షోలు పడుతున్నాయి.

‘అజ్ఞాతవాసి’ తరహాలోనే ‘జై సింహా’కు కూడా వారం రోజుల పాటు రోజుకు ఆరు చొప్పున షోలు వేసుకునే వీలుంది. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో థియేటర్ల కొరత ఉంది. ఈ అదనపు షోల వల్ల ఏపీ వరకు ఈ సమస్య పరిష్కారం అయినట్లే. ఐతే ‘అజ్ఞాతవాసి’కి టాక్ పాజిటివ్‌గా వచ్చి ఉంటే.. ఈ అదనపు షోల అడ్వాంటేజీ బాగా కలిసొచ్చేది. కానీ టాక్ ఏమంత బాగా లేదు. ఆటోమేటిగ్గా టికెట్లకు డిమాండ్ తగ్గుతుంది. వేరే సినిమాల పోటీ కూడా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ షోలు ఫుల్ కావడమే కష్టం. కాబట్టి ఈ అవకాశాన్ని ఆ చిత్రం ఎంతమేరకు ఉపయోగించుకుంటుందో మరి. ‘జై సింహా’పై అంతగా అంచనాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఆ చిత్రం కూడా ఈ అడ్వాంటేజీని ఎలా ఉపయోగించుకుని అదనపు లాభం పొందుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English