నైజాంలో నాని ఫిగర్ చూశారా?

నైజాంలో నాని ఫిగర్ చూశారా?

కొన్నేళ్ల కిందటి వరకు నైజాం ఏరియాలో పది కోట్ల షేర్ అన్నది స్టార్ హీరోలకు ఒక బెంచ్ మార్క్ లాగా ఉండేది. ఐతే ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ రూ.15 కోట్ల మార్కుకు మారింది. స్టార్ హీరో సినిమా హిట్ అనిపించుకోవాలంటే మినిమం రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి నైజాంలో. మీడియం రేంజి హీరోలకైతే ఆ మార్కు రూ.10 కోట్ల దగ్గర ఉంది. రవితేజ స్థాయి హీరోలకు కూడా ఇది కష్టమైన టార్గెటే. అలాంటిది నాని ఏకంగా రూ.14 కోట్ల షేర్ మార్కును దాటేశాడు తన కొత్త సినిమా ‘ఎంసీఏ’తో. క్రిస్మస్ వీకెండ్లో విడుదలైన ఈ చిత్రానికి టాక్ ఏమంత గొప్పగా లేదు. అయినప్పటికీ నాని కెరీర్లో ‘నేను లోకల్’ తర్వాత నైజాం ఏరియాలో రూ.10 కోట్ల షేర్ రాబట్టిన  సినిమాగా ‘ఎంసీఏ’ నిలిచింది.

డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా నైజాంలో రూ.10 కోట్ల షేర్ మార్కును టచ్ చేయడమే ఆశ్చర్యమైతే.. ఇప్పుడు ఏకంగా రూ.14 కోట్లకు దాటిపోయింది షేర్. ఇంకా కూడా ఈ సినిమా అక్కడక్కడా ఆడుతూనే ఉంది. ‘అజ్ఞాతవాసి’ సినిమాను దిల్ రాజే నైజాంలో రిలీజ్ చేశాడు. మెజారిటీ స్క్రీన్లు దానికి ఇచ్చి ‘ఎంసీఏ’ను అక్కడక్కడా ఆడిస్తున్నాడు. సంక్రాంతి సీజన్లో ఈ చిత్రం ఇంకా కొంతమేర వసూళ్లు రాబట్టి.. ఫుల్ రన్లో రూ.15 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో. నాని స్థాయికి అది గొప్ప ఘనతే అవుతుంది. సూపర్ స్టార్లకు మాత్రమే సాధ్యమయ్యే ఘనత అది. ఈ చిత్రం ఓవరాల్ షేర్ రూ.40 కోట్ల దాకా రావడం విశేషం. గ్రాస్ రూ.65 కోట్లకు చేరువగా వెళ్లింది. నాని రేంజ్ ఎలా పెరిగిందో చెప్పడానికి ‘ఎంసీఏ’ సరైన రుజువని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English