ఓ మెగాస్టారూ.. మీకు మీరే సాటి!!

ఓ మెగాస్టారూ.. మీకు మీరే సాటి!!

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ కు ఈ మాటే ఓ ప్రభంజనం. రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి.. సినిమాలకు సుదీర్ఘమైన బ్రేక్ ఇచ్చారు. అయితే.. సినిమాల్లోకి తిరిగి ప్రవేశించాలని అనుకున్నపుడు.. దాదాపు ఓ దశాబ్దం తర్వాత తనను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ప్రశ్న ఆయనను తొలచివేసింది.

పలు సబ్జెక్టులను పరిశీలించిన తర్వాత.. చివరకు తమిళ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించి వివి వినాయక్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కానీ రిలీజ్ తర్వాత చిరును ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి సర్వత్రా కనిపించింది. ఎట్టకేలకు గతేడాది జనవరి 11న ఖైదీ నంబర్ 150 అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి.

తన రీఎంట్రీలోనే చరిత్ర సృష్టించి పడేశారు. నాన్ బాహుబలి రికార్డులు అన్నిటినీ తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి.. అప్పటికి పలు ప్రాంతాల్లో ఆల్ టైం రికార్డులను కూడా తన అకౌంట్లో జమ చేసుకున్నారు. ఒక కమర్షియల్ మూవీతో ఏకంగా 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టి.. టాలీవుడ్ తనే బాద్షా అని.. తన ప్రెజెన్స్ ఉంటే చాలు.. జనాలు ఆటోమేటిగ్గా బారులు తీరతారనే విషయాన్ని ప్రూవ్ చేశారు మెగాస్టార్. అప్పటివరకూ అనేక మంది ఈ 100 కోట్ల రూపాయల షేర్ అందుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఆ తర్వాత కూడా బాహుబలి2కి మినహాయిస్తే ఏ సినిమా వల్లా కాలేదు. ఇప్పుడు పవన్ అజ్ఞాతవాసిపై ఆ అంచనాలు ఉన్న మాట నిజమే అయినా.. టాక్ అందుకు తగినట్లుగా లేదు. టాలీవుడ్ కి మెగాస్టారే కింగ్ అని ప్రూవ్ చేసిన ఖైదీ నంబర్ 150 విడుదల అయ్యి ఇవాల్టితో ఏడాది పూర్తి కావడం విశేషం.  ప్రస్తుతం సైరా అంటూ చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నారు చిరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు