బెంబేలెత్తిస్తోన్న రెండవ రోజు కలక్షన్లు

బెంబేలెత్తిస్తోన్న రెండవ రోజు కలక్షన్లు

అజ్ఞాతవాసి చిత్రానికి టాక్‌ ఎలాగున్నా కనీసం పండగ వెళ్లే వరకు అయినా స్టడీగా వుంటుందని ఆశలు పెట్టుకున్న బయ్యర్లకి రెండవ రోజే దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. రెండవ రోజు ఉదయం ఆట, మ్యాట్నీ వసూళ్లు చూసి బయ్యర్లు గుడ్లు తేలేస్తున్నారు. ఎక్కువ థియేటర్లలో రన్‌ అవుతోన్న ఈ చిత్రానికి ఎక్కడా డీసెంట్‌ వసూళ్లు నమోదు కావడం లేదు. సాధారణంగా పండగ ముందు రోజుల్లో వసూళ్లు తక్కువగా వుంటాయి. ఈ చిత్రానికి వున్న క్రేజ్‌ వల్ల అలాంటి పరిస్థితి రాదని అనుకున్నారు. కానీ ఇటు ప్రీ ఫెస్టివల్‌ ఎఫెక్ట్‌తో పాటు డిజాస్టర్‌ టాక్‌ కూడా తోడయి అజ్ఞాతవాసి వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. సినిమా ఎలాగున్నా కానీ అభిమానులు కొమ్ము కాస్తుంటారు.

కానీ ఈ చిత్రాన్ని వీరాభిమానులు సైతం తిట్టి పోస్తూ పబ్లిగ్గా ఛీ కొడుతున్నారు. రిపీట్‌ ఆడియన్స్‌ అవకాశమే లేకపోవడంతో అజ్ఞాతవాసి ట్రబుల్స్‌ రెండవ రోజుకే తారాస్థాయికి చేరాయి. రేపు విడుదలవుతున్న జై సింహా, గ్యాంగ్‌ చిత్రాల్లో దేనికైనా మంచి టాక్‌ వచ్చినట్టయితే పండగ రోజుల్లో కూడా అజ్ఞాతవాసి కోలుకునే వీల్లేదు. తొలి రోజు నలభై కోట్ల షేర్‌ వసూలు చేసి నాన్‌ బాహుబలి రికార్డయితే తెచ్చుకుంది కానీ మిగతా పెట్టుబడి తిరిగి రాబట్టడానికి ఈ చిత్రం తప్పకుండా తంటాలు పడుతుంది. ఇక మిగతా రన్‌లో మరో ముప్పయ్‌, నలభై కోట్లు సాధించినా కానీ దగ్గర దగ్గర యాభై కోట్ల నష్టం ఖాయమనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు