దిల్‌ రాజుకి మరో గట్టి దెబ్బ

దిల్‌ రాజుకి మరో గట్టి దెబ్బ

నిర్మాతగా వరుస విజయాలు సాధిస్తూ వెళుతోన్న దిల్‌ రాజు తనని ఇంతవాడిని చేసిన పంపిణీ రంగాన్ని వదులుకోలేక చాలా చిత్రాల రైట్స్‌ తీసుకుంటూనే వున్నాడు. నిర్మాతగా లాభాలు గడిస్తోన్న దిల్‌ రాజుకి పంపిణీదారునిగా భారీ నష్టాలు వస్తున్నాయి. స్పైడర్‌ చిత్రానికి పన్నెండు కోట్లకి పైగానే పోగొట్టుకున్న దిల్‌ రాజుకి జై లవకుశతోను మూడు కోట్లకి పైగా నష్టం వచ్చింది. తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో కనీసం పన్నెండు నుంచి పదిహేను కోట్ల వరకు లాస్‌ వుంటుందని ట్రేడ్‌ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

ఫిదా, శతమానం భవతి లాంటి చిత్రాలతో గడించిన లాభాలన్నీ దిల్‌ రాజు ఇలా వేరే సినిమాలు కొని పోగొట్టుకున్నాడు. ఇకపై పంపిణీ తగ్గించాలని, పెద్ద సినిమాల జోలికి పోకుండా ప్రామిసింగ్‌గా కనిపిస్తోన్న చిన్న, మీడియం బడ్జెట్‌ సినిమాల హక్కులని గుత్తంగా కొనేయాలని దిల్‌ రాజు నిర్ణయించుకున్నాడు. అజ్ఞాతవాసి కనుక అతడికి భారీ లాభాలు తెచ్చి పెడితే పెద్ద చిత్రాల పట్ల మక్కువ చూపేవాడేమో. కానీ ఈ దెబ్బతో అతను ఇక భారీ చిత్రాల పంపిణీ వైపు వెళ్లే అవకాశాలు లేవు. ఇప్పటికే నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు తగ్గిపోవడంతో చాలా చిత్రాలకి అమ్మకాలు ఇబ్బంది అవుతున్నాయి. దిల్‌ రాజు లాంటి కల్పతరువు కూడా దూరమైపోతే ఇక ఈ ఏరియాలో నిర్మాతలు సొంతంగా విడుదల చేసుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు