సంతకం పెట్టాకే బాలయ్యతో చేసింది

సంతకం పెట్టాకే బాలయ్యతో చేసింది

సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో ఆసక్తి కలిగిస్తున్న మూవీ జైసింహా. సంక్రాంతికి హీరో బాలయ్య నటించిన ఈ మూవీని దర్శకుడు కేఎస్ రవికుమార్ తెరకెక్కించగా.. నయనతార.. హరిప్రియ.. నటాషా దోషి హీరోయిన్లుగా నటించారు. జైసింహాకు క్రేజ్ తీసుకురావడంలో నయనతార ప్రెజెన్స్ కూడా బాగా ఉపయోగపడింది.

బాలయ్య-నయన్ కాంబినేషన్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ కాంబో కాగా.. మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తుండడం ఆసక్తి కలిగించింది. అయితే.. ఈ చిత్రంలో నటించేందుకు మొదట నయన్ ఒప్పుకోలేదని స్వయంగా బాలకృష్ణ చెప్పారు. ఆ తర్వాత టెర్మ్స్ కుదరడంతో మూవీ యాక్సెప్ట్ చేసిందట నయన్. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఓ మూవీకి ప్రచారం చేయననే మాట నయన్ ముందే చెప్పేస్తుంది. ఆ మేరకు అగ్రిమెంట్ కూడా చేసుకుంటుంది. కానీ బాలకృష్ణ జైసింహాకు మరో రెండు కండిషన్స్ కూడా పెట్టిందట నయనతార. వీటికి దర్శకుడు ఒప్పుకుని వాటిని కూడా అగ్రిమెంట్ లో మెన్షన్ చేసి.. అగ్రిమెంట్ పై సంతకం చేసిన తర్వాతే నటించిందట నయన్.

ఇంతకీ అవేంటో తెలుసా.. సినిమా మొత్తంలో ఎక్కడా హీరో పాత్రధారితో ఇంటిమేట్ సీన్స్.. రొమాంటిక్ సీన్స్ ఉండకూడదు అన్నది ఒక కండిషన్ అయితే.. తెలుగు సినిమాల్లో సహజంగా కనిపించే హీరోయిన్ల డ్యాన్సులు అసలు చేయనంటే చేయనని ఖరాఖండీగా తేల్చేసిందట నయన్. ఈ రెండిటికి ఒప్పుకుని మరీ జైసింహాలో నటింపచేశారన్న టాక్.. ఆశ్చర్యం కలిగిస్తోంది.