కోటికి కక్కూర్తి పడిందా?

కోటికి కక్కూర్తి పడిందా?

దక్షిణాదిలో పలు భాషల్లో గుర్తింపు సంపాదించడం ఇప్పుడు హీరోయిన్లకు కామన్ అయిపోయింది. అయితే.. మూడు దశాబ్దాల క్రితమే తమిళ జనాలతో గుడి కట్టించేసుకున్న హీరోయిన్ ఖుష్బూ. తెలుగులో కూడా కొన్ని చెప్పుకోదగిన సినిమాల్లో నటించిన ఈమె.. చివరగా తెలుగులో స్టాలిన్ మూవీలో మెగాస్టార్ అక్కగా కనిపించింది.

ఆ తర్వాత సినిమాలకే దూరం అయిపోయిన ఈమె.. దాదాపు దశాబ్ద కాలంగా నటించడం మానేసి.. రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇప్పుడు అజ్ఞాతవాసి మూవీలో పవన్ కళ్యాణ్ కు సవతితల్లి పాత్రలో కనిపించింది ఖుష్బూ. ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత.. ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది ఖుష్బూ. త్రివిక్రమ్ తో పని చేసే అవకాశం రావడం.. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం.. తన పాత్రకు బోలెడంత ఇంపార్టెన్స్ ఉండడమే ఈ సినిమాలో నటించడానికి కారణాలుగా చెబుతోంది కానీ.. అసలు కథ వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. సీనియర్ హీరోయిన్స్ ను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూపడంలో బోలెడంత ట్యాలెంట్ ఉన్న త్రివిక్రమ్.. ఖుష్బూకు కోటి రూపాయల ఆఫర్ ఇచ్చి మరీ తీసుకున్నాడట.

అయితే.. అజ్ఞాతవాసి మూవీలో ఈమె చెబుతున్న రేంజ్ లో ఖుష్బూ పాత్ర కనిపించడం లేదనే విమర్శలున్నాయి. నిజానికి ఈ పాత్ర పేపర్ పై చాలా బరువైనదే అయి ఉండవచ్చని.. కానీ మూవీగా మలిచిన తర్వాత.. ఫైనల్ కట్ వరకూ వచ్చేసరికి ఆ పాత్ర తేలిపోయిఉండవచ్చని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English