అన్ని ప్రాబ్లెమ్స్ లోనూ వాళ్లే ఉంటున్నారే

అన్ని ప్రాబ్లెమ్స్ లోనూ వాళ్లే ఉంటున్నారే

టాలీవుడ్ ని ప్రస్తుతం చాలానే సమస్యలు వేధిస్తున్నాయి. ఒకేసారి అనేక ప్రాబ్లెమ్స్ రావడంతో ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ బాగానే ఉంటోంది. పలు రకాల సమస్యల గురించి ఇండస్ట్రీ జనాలు ప్రస్తావిస్తుండగా.. వీటన్నిటిలో కామన్ గా కొంతమంది వ్యక్తులు కనిపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

డిజిటల్ ప్రొజెక్షన్ విధానం అమల్లోకి రావడంతో.. థర్డ్ పార్టీ ఖర్చులు పెరిగిపోయాయని అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఓ దిగ్గజ నిర్మాత ఈ రంగంలోకి ఎంటర్ కానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఖర్చులు పెరిగిపోయాయని.. అందుకే మార్చ్ 1 నుంచి థియేటర్లను మూసివేయనున్నామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటోంది. మరోవైపు డబ్బింగ్ సినిమాలను పండుగ సీజన్లలో బ్యాన్ చేయాలనే డిమాండ్ ఉన్నా.. తమిళ్ సినిమాల డబ్బింగ్ రైట్స్ కొంటున్న కొందరు బడా నిర్మాతలు ఇందుకు అడ్డం పడుతున్నారనే టాక్ వినిపిస్తున్నాయి. ఇక డిస్ట్రిబ్యూషన్ విధానంపై అయితే ముందు నుంచి విమర్శలు ఉన్నాయి.

థియేటర్లు ఓ నలుగురు గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సినిమా ఫెయిల్ అయ్యి నష్టాలు వచ్చినపుడు.. నిర్మాత సేఫ్ అవుతున్నారని.. కానీ డిస్ట్రిబ్యూటర్ మునిగిపోతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. ఇలా రకరకాల ఇండస్ట్రీ సమస్యలు వినిపిస్తుంటే.. అన్ని ఆరోపణలకు కొందరు వ్యక్తులు మాత్రమే కేంద్రంగా నిలుస్తున్న విషయం గమనించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు