‘పద్మావత్’ విషయంలో అదంతా అబద్ధమట

‘పద్మావత్’ విషయంలో అదంతా అబద్ధమట

ఎట్టకేలకు అనేక అడ్డంకుల్ని దాటుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది ‘పద్మావత్’గా పేరు మార్చుకున్న ‘పద్మావతి’ సినిమా. బయట ఈ సినిమాకు వ్యతిరేకంగా ఓవైపు తీవ్ర స్థాయిలో ఆందోళనలు సాగుతోంటే.. మరోవైపు సెన్సార్ బోర్డు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐతే మధ్యలో అనేక చర్చోప చర్చలు.. హిస్టారియన్స్ ఒపీనియన్స్ తీసుకున్నాక ‘పద్మావత్’కు సెన్సార్ పూర్తి చేసి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఐతే ఈ చిత్ర పేరు మార్చడంతో పాటు 25  కట్స్ వేశాకే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్లుగా వారం కిందట గట్టిగా ప్రచారం జరిగింది. మరీ 25 కట్స్ అంటే.. సినిమా ఏం మిగులుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఐతే ‘పద్మావత్’కు 25 కట్స్ వేసిన మాట ఉత్త ప్రచారమే అంటున్నాడు సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి. తాము కేవలం ఐదు చోట్ల మాత్రమే అభ్యంతరాలు చెప్పామని.. తాము చెప్పిన మేరకు మార్పులు చేసి చిత్ర బృందం రీ సెన్సార్‌కు అప్లై చేసుకుందని.. తాము ఓకే చేసి సర్టిఫికెట్ జారీ చేశామని ఆయన వెల్లడించారు. ఈ మాట ‘పద్మావత్’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఉపశమనాన్నిచ్చేదే. ఈ చిత్ర ట్రైలర్ చూడగానే ఒక దృశ్యకావ్యం వీక్షించబోతున్నామన్న భావన కలిగించింది. డిసెంబరు 1కే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి.. ఎట్టకేలకు జనవరి 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఐతే ఆ సమయానికి ఏ అడ్డంకులూ లేకుండా సినిమా సజావుగా విడులవుతుందా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు