ప్రిమియర్లతోనే పది కోట్లు కొల్లగొట్టేశాడు

ప్రిమియర్లతోనే పది కోట్లు కొల్లగొట్టేశాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ షోలు మొదలవడానికి ముందే.. అమెరికాలో ఈ చిత్రం ఏకంగా ఒకటిన్నర మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే రూపాయల్లో చెప్పాలంటే దాదాపు పది కోట్లన్నమాట. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ప్రిమియర్ల ద్వారా 6.16 లక్షల డాలర్లు వచ్చాయి. ఆ మొత్తాన్ని ప్రిమియర్లకు రెండు రోజుల ముందు ప్రి సేల్స్‌తోనే దాటేసింది ‘అజ్ఞాతవాసి’. ఉదయం షోలు అయ్యేసరికే మిలియర్ డాలర్ మార్కును దాటేసిన ఈ చిత్రం.. మొత్తం ప్రిమియర్లు అయ్యేసరికి 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.

నాన్-బాహుబలి సినిమాల్లో ప్రిమియర్లతో ఈ స్థాయి వసూళ్లు ఏదీ సాధించలేదు. మహేష్ సినిమా ‘స్పైడర్’ ప్రిమియర్లతో మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఐతే ఆ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఫుల్ రన్లో 1.5 మిలియన్ మార్కు దగ్గరే ఆగిపోయింది. మరి ‘అజ్ఞాతవాసి’ పరిస్థితేంటో చూడాలి. ఈ చిత్రానికి కూడా టాక్ ఏమంత బాగా లేదు. కాకపోతే వసూళ్లు ఒకేసారి డ్రాప్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. యుఎస్ ఆడియన్స్ టేస్టుకు దగ్గరగా ఉండే సినిమా కావడంతో వీకెండ్ అయ్యే వరకు వసూళ్లు ఓ మోస్తరుగా అయినా వస్తాయనే భావిస్తున్నారు. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కుల్ని ఏకంగా 19.5 కోట్లకు అమ్మారు. అంటే ఈ సినిమా 4 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌కు వస్తుందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు