బాలయ్య అంత తెస్తే సేఫే

బాలయ్య అంత తెస్తే సేఫే

నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. బాలకృష్ణ ఈమూవీతో అందరినీ షాక్ కి గురి చేస్తారని నిర్మాత స్వయంగా చెబుతున్నారు.

ఇంతకీ జైసింహ ఎంత వసూలు చేయాలో తెలుసా? జైసింహా ప్రిరీలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు తెలిసిపోయాయియ. వైజాగ్ 3.2 కోట్లు..  ఈస్ట్ 2.2 కోట్లు..  వెస్ట్ 1.8 కోట్లు..  కృష్ణా 1.9 కోట్లు..  గుంటూరు 2.7  కోట్లు..  నెల్లూరు 1.3 కోట్లు పలకగా..  సీడెడ్ 5 కోట్లు.. నైజాం 5.4 కోట్లకు విక్రయించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 23.5 కోట్ల మేర బిజినెస్ చేసింది. కర్నాటక 1.5 కోట్లు.. ఓవర్సీస్ 1.5 కోట్లు.. ఇతర ఏరియాల బిజినెస్ కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా జై సింహా బిజినెస్ 27.5 కోట్లకు చేరింది. సంక్రాంతి సీజన్ లో బాలయ్యకు ఇదేమీ పెద్ద టార్గెట్ కాదనే టాక్ వినిపిస్తోంది.

సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ మొత్తాన్ని తేలిగ్గానే వసూలు చేసినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ జనాలు అంటున్నారు. ఇక శాటిలైట్.. డిజిటల్ రూపంలో 7.5 కోట్ల రూపాయల వసూళ్లు దక్కగా హిందీతో పాటు ఇతర భాషల్లోకి డబ్బింగ్ వెర్షన్స్ శాటిలైట్.. ఆడియో వంటివి కలిపి 4 కోట్ల రూపాయల మార్కెట్ జరిగింది. మొత్తంగా ఈ చిత్రం 38.5 కోట్ల బిజినెస్ జరగగా.. 40 కోట్లకు మించిన వసూళ్లు సాధిస్తే.. బాలయ్య జైసింహా బ్లాక్ బస్టర్ కేటగిరీలోకి చేరిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు