ఎన్నారై అవతారంలో మాస్ రాజా

ఎన్నారై అవతారంలో మాస్ రాజా

మాస్ మహరాజ్ గా కీర్తి గడించిన రవితేజ ఇప్పుడే కాదు ఎప్పుడూ జోరు చూపిస్తూనే ఉంటాడు. చకచకా సినిమాలు  చేయడంలో రవితేజ లెక్కలు సూపర్ గా ఉంటాయి. మధ్యలో బ్రేక్ తీసుకున్నపుడు మినహాయిస్తే.. రవితేజ అసలు స్లో అయిన టైమే కనిపించదు.

గతేడాది రాజా ది గ్రేట్ తో తిరిగి ఫామ్ అందుకున్న రవితేజ.. ఇప్పటికే టచ్ చేసి చూడు మూవీ ఫినిష్ చేసేశాడు. అంతే కాదు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు కూడా. ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఈ మూవీ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పుడు మరో సబ్జెక్టుకు ఓకే చెప్పాడట రవితేజ. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ మరుసటి సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో మాస్ రాజా ఫుల్ క్లాస్ అవతారంలో కనిపిస్తాడట. అంటే మాస్ రాజా స్టైల్ ఎక్కడా మిస్ కాదు కానీ.. ఎన్నారై గెటప్ లో ఆడియన్స్ ను అలరించేందుకు రవితేజ ఫిక్స్ అయ్యాడట.

ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నా.. సినిమా థీమ్ మాత్రం క్లాస్ గా ఉంటుందని తెలుస్తోంది. కామెడీ విషయంలో శ్రీనువైట్ల మార్క్ ఎక్కడా మిస్ కాదని తెలుస్తోంది. అధిక భాగం ఓవర్సీస్ లోనే షూటింగ్ చేయనుండగా.. మిగిలిన భాగం అంతా హైద్రాబాద్ పరిసరాల్లోనే రూపొందిస్తారట. వీలైనంత వేగంగా ఈ పిక్చర్ ను కంప్లీట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు