సినిమానే బ్యాన్ చేయాలా.. వారెవ్వా?

సినిమానే బ్యాన్ చేయాలా.. వారెవ్వా?

ఓ సినిమా చుట్టూ వివాదాలు ఉంటే.. సెన్సారోళ్లు తెగ కోతలు పెట్టేయడం.. అదే పనిగా కత్తెరకు పని కల్పించడం చాలాసార్లే చూశాం. లెక్కకు మించి కట్స్ పడితే.. రివైజ్ కమిటీకి వెళ్లిన చిన్నా చితకా కట్స్ తో బయటపడ్డ సినిమాలు కూడా ఉన్నాయి. ఆయా సినిమాలు.. సన్నివేశాలపై అభ్యంతరాలు ఉన్నవారు కూడా.. తమ మనోభావాలను దెబ్బ తీసే సీన్స్.. డైలాగ్స్ ఉండకూడదని పట్టు పడతారంతే.

కానీ ఓ సినిమాను పూర్తిగా బ్యాన్ చేసేయాలని డిమాండ్ వినిపించడం ఇదే మొదటిసారి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే లీడ్ రోల్ లో నటించిన పద్మావతి విషయంలో ఇలా నిషేధం డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ బోర్డ్ ప్రకటించడంతో.. ఈ మూవీపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న రాజ్ పుత్ కర్ణి సేన.. ఇప్పుడు ఓ భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈ 27న చిత్తోర్ ఘడ్ లో రాజ్ పుత్ లు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేయడం ద్వారా.. ఈ సినిమాపై తమ ఉద్దేశ్యాన్ని చాటి చెప్పాలని భావిస్తున్నారట.

ఈ సినిమా విడుదల అయితే కొన్ని సీన్స్ కారణంగా రాజ్ పుత్ లు.. ముస్లింల భావాలు దెబ్బ తింటాయనే స్పెషల్ స్క్రీనింగ్ కమిటీ చెప్పినా.. విడుదల నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే.. బీజేపీ అండదండలతోనే ఉద్దేశ్యపూర్వకంగా రాజ్ పుత్ కర్ణి సేన ఇలా చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఓ సినిమాపై పూర్తిగా నిషేధం విధించాలనే మాటలను ఫిలిం లవర్స్ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు