ఏం చేసినా బజ్ రావట్లేదు బాలయ్యా

ఏం చేసినా బజ్ రావట్లేదు బాలయ్యా

నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా వస్తోందంటే.. బాలయ్య అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. అటు ఫ్యాన్స్ ను.. ఇటు మాస్ ను.. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించగలగడం.. బాలకృష్ణకు మాత్రమే చేతనైన ట్యాలెంట్.

ఇదంతా నిజమే అయినా.. మరో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన జైసింహా విషయంలో మాత్రం.. ఫ్యాన్స్ నుంచి ఇంతగా సపోర్ట్ లభించడం లేదు. గతేడాది చిరు కంబ్యాక్ మూవీతోపాటే గౌతమిపుత్ర శాతకర్ణిని విడుదల చేయగా.. రెండిటికీ బోలెడంత బజ్ ఏర్పడింది. ఈ సారి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కోసం జనాలు ఎదురుచూస్తున్నారని ఫిక్స్ అయిపోదామన్నా.. బాలయ్యకు  హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ నుంచి అయినా మద్దతు రావాలి. పైగా జైసింహాకు ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. సాంగ్ ప్రోమోస్ తో పాటు సెకండ్ ట్రైలర్ కూడా ఇచ్చారు మేకర్స్.

ఇన్ని చేస్తున్నా ఆశించిన స్థాయిలో జైసింహాకు బజ్ ఏర్పడ్డం లేదు. హీరోగా బాలయ్య.. స్టార్ క్యాస్టింగ్.. పెద్ద డైరెక్టర్.. ఇన్ని ఉన్నా ఆ మూవీ స్థాయికి తగ్గట్లుగా కూడా న్యూస్ లో వినిపించడం లేదు. ఇందుకు కేఎస్ రవికుమార్ దర్శకుడు కావడమే అన్నది ఫ్యాన్స్ లో వినిపిస్తున్న మాట. చాలా ఏళ్లుగా సక్సెస్ లేని ఈ దర్శకుడితో సినిమా అనగానే.. బాలయ్య ఫ్యాన్స్ నిరాశ చెందారట. అయితే.. సడెన్ గా బ్లాక్ బస్టర్ కొట్టేయడం అంటే.. అది బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న బాలయ్య.. జైసింహాను ఏం చేస్తారో చూద్దాం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు